Formula E Race Case: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సోమవారం ఏసీబీ అధికారులు నోటీసులు పంపించారు. ఫార్మూలా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి ఈనెల 28న విచారణకు హాజరు కావాల్సిందిగా సూచించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ యూకే, అమెరికా పర్యటన తరువాత విచారణకు హాజరవుతానని తెలిపారు. ఈ కార్ రేసు వ్యవహారంలో చేసిన 50 కోట్ల చెల్లింపుల్లో నియమాలను పాటించ లేదంటూ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ఫార్ములా ఈ కేసులో ఈ నెల 28న విచారణకు హాజరుకావాలన్న ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాజకీయంగా వేధించే ఉద్దేశ్యంతో తనపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందన్న సంగతి తెలిసినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు లండన్, అమెరికా పర్యటన ముందే ఖరారైనందున మే 28న విచారణ కు హాజరుకాలేనన్నారు.
Also Read: KTR on MLAs: మనతో ఉండి వెన్నుపోటు పొడిచారు.. కేటీఆర్ సంచలన కామెంట్స్ !
అయితే, విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత కచ్చితంగా విచారణకు వస్తానని ఏసీబీ అధికారులకు కేటీఆర్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. 48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ద్వారా డబ్బులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి పేరును ఈడీ ఛార్జిషీట్‌లో నమోదు చేసిందని కేటీఆర్ తెలిపారు. సరిగ్గా 24 గంటల తర్వాత ప్రధాని మోడీతో సహా బిజెపి అగ్ర నాయకులతో రేవంత్ రెడ్డి సన్నిహితంగా కనిపించారని వెల్లడించారు. మనీలాండరింగ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును ఈడీ పేర్కొన్నప్పటికీ ఒక్క తెలంగాణ బీజేపీ నేత కూడా అతన్ని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు, అనైతిక సంబంధానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు రగిలిపోతున్న రేవంత్ రెడ్డి.. తనపై ప్రతీకారంతో ఎంతకైనా దిగజారుతారన్న సంగతి ఈ ఏసీబీ నోటీసులతో అర్థం అయిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు, రేవంత్ రెడ్డి నాయకుడిగానే కాకుండా, మనిషిగా కూడా ఎంతగా పతనం అవుతున్నారో చెప్పడానికి ఈ చౌకబారు ప్రతీకార చర్యలే నిదర్శనం కేటీఆర్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ను చూస్తే రేవంత్ లో రోజురోజుకూ భయం పెరిగిపోతోందని స్పష్టంగా అర్థమవుతోందన్న కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.
Also Read: Etela Rajender: కాళేశ్వరం కమిషన్ నోటీసులపై.. వాస్తవాలు చెప్పాలని స్పష్టం!
రేవంత్ అభద్రతకు నిదర్శనం మాజీ మంత్రి హరీష్ రావు
ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం రేవంత్ నెలకొన్న అభద్రతను సూచిస్తున్నాయి అందుకే ఆయన ఈ ప్రతికాల రాజకీయ చర్యలు ఎంచుకున్నాడు. తప్పుడు కేసులో ఫోటోలు నిలవవు ప్రజల మనసును గెలుచుకోలేవు. మేము కేసీఆర్ కు అండగా ఉంటాం. ఎప్పటికైనా నిజమే గెలిచి తీరుతుందని ఎక్స్ వేదికగా తెలిపారు.
వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే నోటీసులు ఎమ్మెల్సీ కవిత
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది.
ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులది అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Also Read: Coronavirus In TG: కొవిడ్ సీజనల్ అలర్ట్.. ప్రజల ఆరోగ్యం కోసం ముందస్తు ప్లాన్!