KTR on MLAs: పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలని ఘాటుగా స్పందించారు. ఇది తాను ఆవేశంతో చెప్పడం లేదుని, బాధతో చెబుతున్నట్లుగా వెల్లడించారు. తమతోనే ఉండి తమకే వెన్నుపోటు పొడిచారిన, ఆ 10 మంది సన్నాసులకు కర్రు కాల్చి వాతపెట్టాలని శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో గద్వాల్ నియోజకవర్గం నుంచి కేటీఆర్ సమక్షంలో పలువురు సోమవారం బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్, ఆలంపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచిందని గుర్తుచేశారు.
Also Read: Etela Rajender: కాళేశ్వరం కమిషన్ నోటీసులపై.. వాస్తవాలు చెప్పాలని స్పష్టం!
ఉప ఎన్నికలు వస్తే గద్వాల్ లో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్ ఇచ్చిన అభయ హస్తం ఈ శతాబ్దపు అతి పెద్ద మోసమని ఆయన విమర్శలు చేశారు. దిక్కుమాలిన కాంగ్రెస్ ను నమ్మి పాలమూరు ప్రజలు బొక్కబోర్ల పడ్డారన్నారు. నాడు నీళ్లు, నిధులు, నియామకాల కోసం తాము ఉద్యమం చేస్తే.., కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తరువాత నిందలు, దందాలు, చందాలు అనే నినాదంలో పనిచేస్తున్నాయని ఆరోపణలు చేశారు. రుణమాఫీపై అనేక సార్లు మాట మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఒకసారి రాము, ఇంకోసారి రెమో అవుతాడని చురకలంటించారు. సినిమాలో రెమోకు జుట్టు ఉంటుంది, ఈ రేవంత్ రెడ్డికి జుట్టు ఉండదని సెటైర్లు వేశారు. గద్వాల్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ఖాయమని, అభ్యర్థి ఎవరన్నది కాదని, కారు గెలుపు లక్ష్యంగా పనిచేయలాని దిశానిర్దేశం చేశారు. జూన్ లో మెంబర్షిప్ డ్రైవ్ చేపడుదామని కేటీఆర్ వివరించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుందామని పేర్కొన్నారు. ఎన్నిక ఏదైనా కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గద్వాల్ నియోజకవర్గ ఇన్ చార్జీ హనుమంతు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Coronavirus In TG: కొవిడ్ సీజనల్ అలర్ట్.. ప్రజల ఆరోగ్యం కోసం ముందస్తు ప్లాన్!