Waqf Bill (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టం ముస్లింల హక్కులకు విరుద్దం.. షబ్బీర్ అలీ!

Waqf Bill: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్, ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా సైఫుల్లా రెహమాని, కర్ణాటక మున్సిపల్ మంత్రి రహీం ఖాన్,వివిధ మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుమేరకు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2025 వక్ఫ్ సవరణ చట్టం పేరుతో ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చి మసీదులు, మదర్సాలు, ఈద్గాలు, శ్మశానవాటికల వంటి వక్ఫ్ ఆస్తులను ముస్లింల నుండి లాక్కోవాలని చూస్తుందని ఆరోపించారు.

ఈ నల్ల చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ముస్లింల ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కులను రద్దు చేయాలని , ముస్లింల మతపరమైన గుర్తింపును తుడిచివేయాలని కోరుకుంటుందన్నారు. దేశవ్యాప్తంగా ముస్లింలు వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని వారన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టంను ఉపసంహరించుకోవాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025 ను ఉపసంహరించుకోకపోతే, దేశంలోని ముస్లింలందరి నుండి భారీ నిరసనలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ సభలో మాజీ మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర మాజీ ఐడిసి చైర్మన్ మహమ్మద్ తన్వీర్,ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకులు మౌలానా అబూ తాలిబ్, జాఫర్ పాషా, జమాతే ఇస్లామి నాయకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.

Also Read: TPCC Mahesh Kumar Goud: బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతోంది.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

1995లో వక్ఫ్ చట్టం అమలు

భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నియంత్రణకు సంబంధించి 1995లో వక్ఫ్ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం లోపభూయిష్టంగా ఉందంటూ మోదీ సర్కారు సవరణ తీసుకొచ్చింది. దీనికి లోక్ సభ ఆమోదముద్ర వేసింది. 1995 లో చట్టం ముస్లిం సమాజంలో దానధర్మాల ఆస్తులను మతపరమైన, సామాజిక ఉద్దేశాల కోసం రక్షించడానికి రూపొందింది. అయితే, దీనిలో కొన్ని లోపాలు అవినీతి, ఆస్తుల దుర్వినియోగం, పారదర్శకత లేమి కారణంగా కేంద్ర ప్రభుత్వం 2025లో వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టింది.

కొత్త వక్ప్ సవరణ చట్టంలో ఎముంది.

కొత్తగా తెచ్చిన 2025 బిల్లు వక్ఫ్ చట్టాన్ని “యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్”గా పేరు మార్చారు. ఈ బిల్లు పారదర్శకత, సాంకేతికత ఆధారిత నిర్వహణను లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త నిబంధనల ప్రకారం, వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలని, ఆస్తి అతని సొంతం కావాలి. తాజా చట్టంలో “వక్ఫ్ బై యూజర్” నిబంధన తొలగించబడింది. వక్ఫ్-అలల్-ఔలాద్‌లో స్త్రీలతో సహా వారసుల హక్కులు కాపాడబడతాయి. సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్‌కు మారింది. వక్ఫ్ ఆస్తుల వివరాలు ఆరు నెలల్లో కేంద్రీయ పోర్టల్‌లో నమోదు చేయాలి. వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు స్త్రీలతో పాటు ఇద్దరు ముస్లిం కాని సభ్యులను చేర్చాలి. ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కావు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేయవచ్చు. సెక్షన్ 40 తొలగించబడి, వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించే అధికారం ఉండదు.

Also Read: KTR on CM Revanth: బీఆర్ఎస్ లో రేవంత్ కోవర్టులు.. కేటీఆర్ సంచలన కామెంట్స్!

 

Just In

01

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!