KTR on CM Revanth9 image credit: swetcha reporter)
Politics

KTR on CM Revanth: బీఆర్ఎస్ లో రేవంత్ కోవర్టులు.. కేటీఆర్ సంచలన కామెంట్స్!

KTR on CM Revanth: అన్ని పార్టీలో కోవర్టులు ఉంటారు.. మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉంటే ఉండొచ్చు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సమయం వచ్చినప్పుడు కోవర్టులు ఎవరైనా ఉంటే వాళ్లే బయటపడతారని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాయడంపై స్పందించారు. పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీకాదన్నారు.

లోక్ సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు 17 రోజుల పాటు వేలమంది కార్యకర్తలతో ఎనిమిదితొమ్మిది గంటలు నిర్వహించామన్నారు. డైరెక్టుగా మైక్ లో మాట్లాడిన వారున్నారు.. కొంతమంది చిట్టీల మీద రాసిచ్చారు. కొంతమందికి కేసిఆర్ కు ఉత్తరం ఇవ్వాలని రాసిచ్చినవారున్నారు… మా పార్టీలో ఎంకరేజ్ ఓపెన్ కల్చర్ … డెమెక్రసీ ఉంది. డెమోక్రటిక్ పార్టీ కాబట్టి ప్రజాస్వామిక స్పూర్తి ఉన్నపార్టీ.. అధ్యక్షుడికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయవచ్చు అదేదో చాలా గొప్ప విషయం అన్నట్లు.. మీరందరూ బాధపడాల్సిన అవసరం లేదు.. మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షులవారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వొచ్చు అని పేర్కొన్నారు.

Also Read: Hyderabad EV Buses: హైద‌రాబాద్‌కు మ‌రో 800 ఈవీ బ‌స్సులు కేటాయించండి.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి!

మనం ఎవరమైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటది అంది అందరికీ వర్తిస్తదన్నారు. వీళ్లకు వాళ్లకు కాదు..ఎవరం అయినా ఒక్కటేనని స్పష్టం చేశారు. పార్టీ నేతలకు అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంది.. ఆఫీసు బేరర్స్ ఉన్నారు..వారి చెప్పుకునే అవకాశం ఉంది.. ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే..అందరికీ ఇదే సూత్రం వర్తిస్తదన్నారు. గతంలో కూడా అధ్యక్షులకు సూచనలు, సలహాలు ఇస్తూ అనేకమంది లేఖలు రాశారన్నారు.

రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి

నైతికత,నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు ఉండడం తెలంగాణకే అవమానకరమన్నారు. కర్నాటకలో డీకే శివకుమార్ ను అక్కడి బీజేపీ నేతలు విమర్శిస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అనకపోవడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అపురూప సంబంధానికి నిదర్శనమన్నారు. విచ్చలవిడిగా స్కాం లు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వం ఎందుకు కాపాడుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. గతంలో ఎన్నో తప్పులు చేసిన రేవంత్ రెడ్డికి ఇప్పటికీ బుద్ధి రాలేదన్నారు.

2015 ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ రెడ్డిని బ్యాగ్ మాన్ అని పిలుస్తున్నారన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు సీటుకు రూట్ కుంభకోణం అన్నారు. 50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కున్నాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా ముందటనే చెప్పాడని.. ఆనాడు కోమటిరెడ్డి చేసిన ఆరోపణలకు, ఇప్పుడు చార్జి షీట్ తో ఈడీ ఆధారాలు చూపించిందన్నారు. ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ పొజిషన్ ని అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు అన్న వివరాలను ఈడీ తన చార్జిషీట్లో స్పష్టంగా బయటపెట్టిందన్నారు.

Also Read: CM Revanth Reddy: 2047 నాటికి భారత దేశాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టాలి.. సీఎం కీలక వ్యాఖ్యాలు!

తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందన్నారు. ఢిల్లీ కాంగ్రెస్కు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు భారీ మొత్తంలో అందిస్తూ రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు మూటల ముఖ్యమంత్రి అని తేలిపోయిందని విమర్శించారు. 17 నెలల్లోనే 44 సార్లు ఢిల్లీకి పోయి సీఎం రేవంత్ రెడ్డి అరుదైన రికార్డు సృష్టించారన్నారు.

చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకోవడం, కేసుల నుంచి తప్పించాలని వేడుకోవడం.. బయటికి వచ్చి పెద్ద పెద్ద ఫోజులు కొట్టడం ఇదే రేవంత్ రెడ్డి 44 సార్లు ఢిల్లీకి పోయి చేసేదిఇదేనన్నారు. ఒక్క ఇటుక పేర్చకుండానే, ఒక కొత్త ప్రాజెక్టులు కట్టకుండానే, ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండానే, ఒక్క హామీని అమలు చేయకుండానే… లక్షా 80 వేల కోట్ల అప్పు చేశాడని, ఈ డబ్బులు అన్ని ఎక్కడికి పోతున్నాయో ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

రాహుల్ గాంధీ అఫీషియల్ బాస్ అయితే.. నరేంద్ర మోడీ అమిత్ షాలు రేవంత్ రెడ్డికి అనఫిషియల్ బాసులుఅని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పై నిందలు.. బిల్డర్లు -కాంట్రాక్టర్లతో దందాలు…ఢిల్లీ బాస్ లకు వేలకోట్ల చందాలు.. సంవత్సర కాలం నుంచి రేవంత్ రెడ్డి చేస్తున్నది ఇదేఅన్నారు. దేశంలోని అన్ని విషయాలపై మాట్లాడే రాహుల్ గాంధీ తన పార్టీ ముఖ్యమంత్రి చేస్తున్న ఈ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి సిగ్గు.. నైతిక విలువలు ఉంటే వెంటనే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Also Read: Minister Konda Surekha: గిరిజ‌నుల‌ను ఇబ్బంది పెట్టొద్దు.. అటవీ అధికారులకు మంత్రి సురేఖ ఆదేశం!

హౌసింగ్ స్కామ్ లో ఆరోపణలు వచ్చిన తర్వాత నాటి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేశారని, అవినీతి ఆరోపణలు వస్తే గతంలో ఎందరో కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు.. అలానే రేవంత్ రెడ్డి కూడా పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి బాగోతాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కాంగ్రెస్ డీఎన్ఏ లోనే కరప్షన్ ఉందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ నేతలు అంతా మౌన మునుల్లాగా మారిపోయారని దుయ్యబట్టారు.

ఇది కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అపురూపమైన సంబంధానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూదందా అక్రమాలకు రేవంత్ రెడ్డి వత్తాసు పలుకుతున్నందుకే మౌనమా ?అని ప్రశ్నించారు. పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు జరిపి దాదాపు సంవత్సరం అవుతుందని, ఇప్పటిదాకా అటు ఈడీ వైపు నుంచి కానీ ఇటు పొంగిలేటి వైపు నుంచి కానీ ఒక్క ప్రకటన కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ మంత్రులను మోడీ ఎందుకు కాపాడుతున్నారన్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కవుతున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

నెలరోజుల్లోగా రేవంత్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని అన్నారు. ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్‌ను కలిసి విచారణ కోరతామన్నారు. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, దెయ్యం రేవంత్‌రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ దెయ్యాన్ని, శనిని వదిలించడమే తమ పని అన్నారు. ఫ్రస్టేషన్లో రేవంత్ రెడ్డి ఏదేదో చేస్తుంటారు.. లీకులు ఇస్తుంటారన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు వచ్చిందన్న వార్తను కొన్ని పత్రికలు అసలు రాయనే లేదన్నారు. మీడియా ఎంత తాపత్రయపడ్డా, ఎన్ని అడ్వటైజ్మెంట్ లు తీసుకున్నా రేవంత్ రెడ్డి ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి అని ప్రజలకు అర్థమైపోయిందన్నారు. మీడియా ఎన్ని దాచినా సోషల్ మీడియాతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు.

Also RaedWarangal Traffic Police: ట్రాఫిక్ పోలీసుల నయా దందా.. అక్రమాలపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం!

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు