up cm yogi ai video goes viral
జాతీయం

UP CM Viral Video : యూపీ సీఎం వీడియో నెట్టింట వైరల్, కేసు నమోదు

UP CM’s Video Goes Viral, Case Registered : మారుతున్న కాలానుగుణంగా అన్ని రంగాల్లోనూ టెక్నాలజీని వాడుకుంటున్నారు. అయితే ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకొంటే అలా మనకు దాని సేవలను అందిస్తుంది. పెరిగిన సాంకేతిక అభివృద్దిని మంచి కోసం ఉపయోగించుకుంటేనే అందరికి మంచి జరుగుతుంది. అయితే ఇటీవలి కాలంలో టెక్నాలజీని మంచి కోసం కాకుండా చాలామంది చెడు కోసం మాత్రమే ఎక్కువగా వినియోగించినట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే గతంలో చాలామంది ఫోటోల మార్పింగ్‌తో చాలా న్యూసెన్స్‌ని క్రియేట్ చేశారు. తాజాగా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

ఈ వీడియోలో డయాబెటిస్‌ వ్యాధికి సంబంధించిన ఔషధాన్ని తయారుచేసినట్టుగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ చెప్పినట్టుగా ఉంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇక ఈ వీడియోలో 41 సెకండ్ల వీడియోని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు గుర్తు తెలియని దుండగులు. అనూహ్యంగా ఫేస్‌బుక్‌లో ఈ వీడియోకి 2.25 లక్షలకు పైగా మంది వీక్షించారు. అంతేకాదు 120 షేర్లు వచ్చాయి.

Read More:ప్రపంచ సుందరిగా క్రిస్టినా పిస్కోవా

గతంలోనూ భారత ప్రధాని నరేంద్రమోదీ, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటి రష్మిక మందన్నకు చెందిన ఫేక్ వీడియోలను గతంలో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో కూడా ఇదే వరుస ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు సైతం దీన్ని నిర్మూలించేందుకు సీరియస్‌గా దర్యాఫ్తు చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వీడియోను ఏఐ ద్వారా మార్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు. డయాబెటీస్ వ్యాధికి సంబంధించి తయారు చేసినట్టుగా ఆ వీడియోలో సీఎం పేర్కొన్నారు. దేశం నుండి డయాబెటిస్ తరిమివేయనున్నట్టుగా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఔషధాన్ని కొనుగోలు చేయాలని కూడా సీఎం యోగి పేర్కొన్నట్టుగా ఈ వీడియోలో మనకు క్లారిటీగా కనిపిస్తోంది.

Read More: ప్రైవేటు టీచర్ల గోస పట్టించుకోరూ..!

ఈ ఫేక్ వీడియోపై ఐపీసీ 419, 420, 511 పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 2008 సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సంఘటనకు పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇంటర్‌నెట్‌, సోషల్‌మీడియాను ఉపయోగించే ప్రముఖులందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?