Kristina Piskova as Miss world-2024
జాతీయం

Miss World-2024 : ప్రపంచ సుందరిగా క్రిస్టినా పిస్కోవా

Kristina Piskova as Miss world-2024:  మిస్‌వరల్డ్ 2024 పోటీలు ఇండియాలో జరిగాయి. ఈ వేడుకలకు ముంబై నగరం వేదికగా నిలిచింది. 2024 మిస్‌వరల్డ్ ఫైనల్ పోటీలు ముంబైలో అట్టహాసంగా జరిగాయి. మిస్‌వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా పిస్కోవా సొంతం చేసుకున్నారు. రన్నరప్‌గా లెబనాన్‌కు చెందిన అజైటౌన్ నిలిచారు.

సుదీర్ఘకాలం.. అంటే దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ వేడుకలకు తీసినట్లు అయ్యింది. మిస్‌వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది ముంబై మహానగరం. ఈ కార్యక్రమంలో మిస్‌వరల్డ్ 2024 విజేతను న్యాయనిర్ణేతలు అనౌన్స్‌ చేశారు. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య ఈ పోటీలో నిలిచిన ఇండియాకు ఈసారి నిరాశే ఎదురైందని చెప్పాలి. భారత్ తరపున కన్నడ భామ సినీ శెట్టి ప్రాతినిధ్యం వహించగా కనీసం రన్నరప్‌గా కూడా టైటిల్‌ని గెలుచుకోలేకపోయింది.

Read More: ప్రైవేటు టీచర్ల గోస పట్టించుకోరూ

కన్నడ భామ సినీ శెట్టి టాప్ ఎనిమిదికే పరిమితమయ్యారు. ఈ ఏడాది ఈ కిరీటాన్ని చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా కైవసం చేసుకుని అందరిని షాక్‌కి గురిచేసింది. మాజీ ప్రపంచ సుందరి మేగాన్ యంగ్ కొత్త ప్రపంచ సుందరి కిరీటం ద్వారా ఏళ్ల నాటి సంప్రదాయాన్ని అనుసరించారు.

ఈ పోటీలో..లెబనాన్‌కు చెందిన యాస్మినా జైటౌన్ 71వ మిస్ వరల్డ్‌లో మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీలో టాప్ 4 ఫైనలిస్ట్‌లలో లెబనాన్, ట్రినిడాడ్, టొబాగో, బోట్స్వానా, చెక్ రిపబ్లిక్ ఉన్నాయి. భారత పోటీదారు సినిశెట్టి టాప్ ఎనిమిది వరకు ప్రతి రౌండ్‌ను సులభంగా పాస్ చేస్తూనే ఉంది.

Read More: యూరప్ దేశాలలో విజృంభిస్తున్న పారెట్ ఫీవర్

కాగా… ఆతిథ్య దేశానికి చెందిన పోటీదారులు టాప్ 4 రేసులో ఎలిమినేట్ అయ్యారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నీతా అంబానీ, మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్నారు. 71వ మిస్ వరల్డ్ పోటీని మాజీ ప్రపంచ సుందరి మేగాన్ యంగ్, కరణ్ జోహార్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో షాన్, నేహాకక్కర్, టోనీ కక్కర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.