Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైళ్లలో నిత్యం ప్రయాణించేవారికి ఎల్ అండ్ టీ మెట్రో యాజమాన్యం ఊహించనని శుభవార్త చెప్పింది. మట్రో ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఇది వరకు ప్రకటించింది యాజమాన్యం. తగ్గిన ఛర్జీలు శనివారం నుండి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రయాణికుల పై చాలవరకు ఆర్ధిక భారం తగ్గనుంది. ప్రయాణికులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
Also Read: Balanagar Crime: సెలవుల్లో ఎంజాయ్ చేద్దామని.. చిన్నారిపై అఘాయిత్యం!
టికెట్ ధరలను ఇటీవల పెంచిన ఎల్ అండ్ టీ సంస్థ.. సవరించిన ధరలపై తాజాగా 10 శాతం తగ్గిస్తున్నట్లు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం మెట్రో ఛార్జీలను సవవరణ చేస్తూ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఒక ప్రకటన విడుదల చేసింది. 10 శాతం తగ్గించిన తర్వాత మెట్రో ఛార్జీలను ఎల్ అండ్ టీ మెట్రో ప్రకటించింది. ఇందులో భాగంగా కనిష్టంగా 2 కిలోమీటర్ల లోపు టికెట్ ధర రూ. 11 రూపాయలు చేసింది.
గరిష్ఠంగా రూ.69 వరకు ధరలను నిర్ణయించింది. ఇక తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. కాగా, ఇటీవల మెట్రో టికెట్ ధరల మీద 20 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత రావడంతో.. తర్వాత తాజాగా సంస్థ పది శాతం తగ్గింపు నిర్ణయం తీసుకుంది.
Aslo Read: Miss Indonesia: నంబర్ వన్ మిస్ ఇండోనేషియా.. ముగిసిన వరల్డ్ టాలెంట్ షో గ్రాండ్ ఫైనల్!
తగ్గింపు తర్వాత మెట్రో టికెట్ కొత్త ధరలు ఇవే!
తగ్గిన ధరలు ఇలా ఉన్నాయి….
❄️ రెండు కిలోమీటర్ల వరకు రూ. 11
❄️2 నుంచి 4 కిలోమీటర్ల వరకు రూ.17
❄️4 నుంచి 6 కిలోమీటర్ల వరకు రూ.28
❄️ 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు రూ.37
❄️9 నుంచి 12 కిలోమీటర్ల వరకు రూ.47
❄️12 నుంచి 15 కిలోమీటర్ల వరకు రూ.51
❄️15నుంచి 18 కిలోమీటర్ల వరకు రూ.56
❄️18నుంచి 21 కిలోమీటర్ల వరకు రూ.61
❄️21 నుంచి 24 కిలోమీటర్ల వరకు రూ.65
❄️24 నుంచి ఆపై కిలోమీటర్ల కు రూ.69