GHMC: వర్షాకాలం సమీపిస్తున్నందున గడ్డి అన్నారం డివిజన్ లో జరుగుతున్న బాక్స్ డ్రెయిన్ పనులను వెంటనే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఎల్బీనగర్ జోన్ లో పర్యటించి పలు అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ జోన్ లోని సరూర్ నగర్ సర్కిల్ లో పలు ప్రాంతాలలో పలు పనులు కమిషనర్ పరిశీలించారు.
Also Read: Niloufer Superintendent: నిలోఫర్ సూపరింటెండెంట్ అత్యుత్సాహం.. మంత్రి పై కూడా అసత్య ప్రచారాలు!
కమిషనర్ వెంకటేశ్వర్ కాలనీ కి వెళ్లగా,ఆ కాలనీకి చెందిన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కమిషనర్ ను కలిసి కాలనీ కి సంబంధించి సమస్యలను వివరించగా,వెంటనే పరిష్కరించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్ లను ఆదేశించారు. గడ్డిఅన్నారం డివిజన్ లో బాక్స్ డ్రెయిన్ పనులను పరిశీలించి,వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
వల్లభ్ నగర్ లో వాటర్ లాగింగ్ పాయింట్ ను కమిషనర్ పరిశీలించారు. ఈ పర్యటనలో కమిషనర్ వెంటనే జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్ఈ అశోక్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Hyderabad Development: హైదరాబాద్ డెవలప్ పై సీఎం ప్రత్యేక ఫోకస్.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!