Delhi High Court: భార్యతో బలవంతం చేయడం శిక్షార్హమైన నేరం కాదంటూ డిల్లీ హైకోర్టు సంచన తీర్పు చెప్పింది. భర్తనతనకు ఇష్టం లేకపోయిన బలవంతం చేశాడంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటీషన్ విచారణ సందర్బంగా కోర్టు పై విధంగా వ్యాక్యానించింది. పెళ్లి చేసుకోవడమంటే అంగీకారం తెలిపినట్లే అని కోర్టు పేర్కోంది. అసహజం గానే పరిగణించినా, వివాహ బంధానికి ఆ చట్టం వర్తించదని డిల్లీ హైకోర్టు తెలిపింది.
ఒక భర్తపై ఐపీసీ సెక్షన్ 377 కింద అభియోగం మోపాలని సెషన్స్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్ నుండి ఈ కేసు తలెత్తింది. ఫిర్యాదుదారుడు తన అనుమతి లేకుండా లైంగిక దాడి జరిగిందని ఎప్పుడూ ఆరోపించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఫిర్యాదుదారుడి ప్రకటన కేవలం చర్యను వివరించిందని, కానీ బలవంతం లేదా అసమ్మతి లేకపోవడాన్ని సూచించలేదని న్యాయవాది పేర్కోన్నారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. నగలు చోరీ చేశారని మహిళ సూసైడ్!
గతంలో ఓ కేసులో భార్యతో భర్త చేసే బలవంతపు, అసహజ లైంగిక చర్యలు నేరాలు కాబోవని ఛత్తీస్‌గడ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అయితే భార్య వయసు 18 ఏళ్లలోపు లేకుంటే లైంగిక సంబంధం నెరపేందుకు ఆమె సమ్మతి పొందాల్సిన అవసరం భర్తకు ఉండదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ఏకసభ్య ధర్మాసనం తన నిర్ణయాన్ని ప్రకటించింది. 2017లో ఓ వ్యక్తి భార్య అనుమతి తీసుకోకుండానే ఆమెతో అసహజ లైంగిక సంబంధం నెరిపాడు. దాని కారణంగా ఆమె అస్వస్థతకు గురైంది దీంతో ఆమేను ఆస్పత్రిలో చేర్పించారు. అయినా డాక్టర్లు ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు.
బలవంతం కారణంగానే తన ఆరోగ్యం పాడయినట్టు తమ బందువులు కోర్టుకు తెలిపినను ఆమె మరణ వాంగ్మూలంలో పేర్కొంది. పోస్టుమార్టం చేసిన వైద్యులు కూడా నిజమని దీన్ని ధ్రువీకరిస్తు నివేదిక ఇచ్చారు. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు భర్తకు 10 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టులో అప్పీలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి అక్కడి పరిస్థితులను గమనిస్తే ఇది బలత్కారం కిందకు రాదని తెలిపారు.
Also Read: Crime News: మహిళా డాక్టర్‌పై.. మరో డాక్టర్ అత్యాచారం!