Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం పీఎస్ పరిధిలో చింతల్‌కుంటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఏడు తులాల బంగారు ఆభరణాలు కనిపించక పోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో తన రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్ కుమార్‌తో కలిసి మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మహిళ సుధేష్ణ చికిత్స పొందుతూ మరణించగా తన కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంగటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read: CI Suspended: రక్షక భటుడు రాక్షసుడయ్యాడు.. మహిళపై సీఐ లైంగిక వేధింపులు!
సుధేష్ణఈ నెల 16న నాచారంలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు సుధేష్ణ ఇంట్లో దొంగలు చోరి చేశారు. సుధేష్ణకు చెందిన ఏడు తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. అవి ఎంత వెతికిన దొరక్కపోవడంతో తను మానసికంగా కుంగిపోయింది. ఆగమయ్య నగర్‌లోని తన నివాసంలో మూడో అంతస్తు నుంచి కుమారుడితో పాటు కిందకు దూకింది. దీంతో వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మృతురాలి కొడుకు స్వల్ప గాయాలతో బయటపడగా, ఏడు తులాల బంగారు నగలు పోయాయని సుధేష్ణ ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: Coronavirus Cases: కరోనాతో ఎలాంటి టెన్షన్ లేదు.. డాక్టర్ రవీంద్రనాయక్!