Rajiv Gandhi Death Anniversary: ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ అంతా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతోనే జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండల కేంద్రాలలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశ నిర్మాణానికి కారకులైన మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు వీరందరినీ స్మరణకు తెచ్చుకోవాలన్నారు.
రాజీవ్ గాంధీ ఆత్మకు శాంతి చేకూరాలని, నేడు యువత ఆయన చేసిన సేవలను గుర్తుంచుకోవాలన్నారు. సాంకేతిక విప్లవం,18 సంవత్సరాల ఓటు హక్కు, రాజ్యాంగంలో పంచాయతీరాజ్ శాఖ 73,74 యాక్ట్ ఢిల్లీ నుంచి గల్లికి జవహర్ రోజుగార్ యోజన లాంటి అనేక సంస్కరణలను రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయనకు నివాళులు అర్పిస్తున్నామన్నారు.
Also Read: CM Revanth Reddy: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు.. అధికారులకు సీఎం కీలక అదేశాలు!
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు కంది తిరుపతిరెడ్డి, బోయిని నిర్మల జయరాజ్, హుస్నాబాద్ సింగల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, బంక చందు, మంద ధర్మయ్య, సీనియర్ నాయకులు చిత్తారి రవీందర్, సంజీవరెడ్డి, బసవరాజ్ శంకర్, గంపల శ్రీనివాస్,బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Thummala Nageswara: పదేళ్లుగా అపెక్స్’ ఆడిట్ ఎందుకు చేయలేదు.. అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం!