Hyderabad Rains (Image Source: AI)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపైకి నీరు.. ప్రజలు ఇక్కట్లు!

Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని దిల్ సుఖ్ నగర్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, బషీర్ బాగ్, కోటి, ఎంజే మార్కెట్, చాదర్ ఘాట్, కొత్త పేట, మలక్ పేట, చంపాపేట పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు చోట్ల మోస్తరు వర్షం కురవగా.. అక్కడక్కడా భారీ వర్షం పడింది.

ఉదయం నుంచి ఎండ వేడితో అల్లాడిన ప్రజలు.. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఆహ్లాదం పొందుతున్నారు. మరోవైపు  భారీ వర్షం కురిసిన ఏరియాల్లో రోడ్లపైకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉన్నందున అవసరమైతేనే బయటకు రావాలని నగరవాసులకు అధికారులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు వానల కురుస్తాయని చెప్పింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశముందని అభిప్రాయపడింది. ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షం కురిసే అవకాశముందని చెప్పింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో వాన కురవడం గమనార్హం.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు