Dalita Bandhu Scheme: వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు, ముఖ్యంగా మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తుంది. బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పేరుతో దళితులకు రూ.10 లక్షలు ఇస్తే అంబేద్కర్ అభయ హస్తం పేరుతో దళితులకు 12 లక్షలు ఇస్తామని దళితులను రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కెసిఆర్ వెన్నుపోటు పొడిచి కడియం శ్రీహరి రూ.200 కోట్లకు అమ్ముడు పోయాడని మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను మాదిగ సోదరుల వల్లే జెడ్పీటీసీ అయిన ఎమ్మెల్యే అయిన ఎంపీ అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అయినా దళితుల కోసం మాదిగల కోసం ఒక్క పథకం కూడా ప్రవేశ పెట్ట లేదు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో మాదిగలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గ్రామ సభలో జరగాలి కానీ ఇక్కడ మాత్రం కడియం శ్రీహరి ఇంట్లో ఆయన అనుచరుల ఇంట్లో జరుగుతుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అంబేద్కర్ అభయ హస్తం పేరుతో 12 లక్షలు ఇస్తాం అని చెప్పి దళితులను మోసం చేశారన్నారు. మంత్రి వర్గంలో ఒక్క మాదిగ వారు కూడా లేకపోవడం వల్లే మాదిగల గురించి పట్టించుకునే వారు లేకుండా పోయారన్నారు.
Also Read: Hyderabad Matrimonial Scam: వృద్ధులే వారి టార్గెట్.. పెళ్లి పేరుతో గాలం.. చిక్కారో ఇక అంతే!
1994 నుండి 2004 వరకు ఒక్క మాదిగ బిడ్డను కూడా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఎదగనివ్వలేదు. పైగా ఎంతో మంది దళితులను ఎన్ కౌంటర్ ల పేరు మీద పొట్టన పెట్టుకున్న నీచ చరిత్ర కడియం శ్రీహరిది అన్నారు. గతంలో స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలో అనేక పదవులలో పని చేసిన గబ్బెట బుచ్చయ్య, కాసం దర్గయ్య, వాసు, మారపాక రత్నం, మారపాక రవి వీళ్లందరూ వెలుగులోకి రాకుండా చేసింది కడియం శ్రీహరినే అని ఆరోపించారు. ఇప్పటికైనా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలో 35 శాతం ఉన్న మాదిగలకు ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కానీ ప్రభుత్వ పథకాల విషయంలో కానీ తగిన ప్రాధాన్యత కల్పించాలి అని రాజయ్య డిమాండ్ చేశారు.
Also Read: Abdullahpur Met mandal: కబ్జాలపై కలెక్టర్ సీరియస్.. నాకేం సంబంధం లేదన్న ఎమ్మెల్యే!