Hyderabad Matrimonial Scam (imagecredit:swetcha)
క్రైమ్

Hyderabad Matrimonial Scam: వృద్ధులే వారి టార్గెట్.. పెళ్లి పేరుతో గాలం.. చిక్కారో ఇక అంతే!

Hyderabad Matrimonial Scam: పెళ్లి అనేది మనిషి జీవితానికి పరిపూర్ణతనిచ్చే విషయం పెళ్లి కోసం కలలు కనేవాళ్ళు చాలామది ఉంటారు. యుక్త వయసులో పెళ్లిఅనేది ఒక కల అయితే వయసైపోయాక జీవిత భాగస్వామి మరణించినవాళ్లకి పెళ్లి ఒక తోడును తెచ్చిపెట్టే అవసరం అవుతుంది. ఇలాంటోళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ఇద్దరు కిలాడీ లేడీస్ పెద్ద స్కెచ్ వేశారు. పెళ్లి కోసం ట్రై చేస్తున్న వృద్ధులను టార్గెట్ చేసుకొని ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఇద్దరు మహిళలు హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది.

ఒంటరిగా ఉంటున్న వృద్ధులను టార్గెట్​చేసుకొని, పెండ్లి సంబంధాల పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు మహిళలను మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంద్రప్రదేశ్ కృష్టాజిల్లా తిరువూరుకు చెందిన కటారు తాయారమ్మ అలియాస్​ సరస్వతీ(65), ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన కూనపరెడ్డి స్వాతి (40) కలిసి ఓ దినపత్రికలో మ్యారేజ్ బ్యూరో పేరుతో వృద్ధుల కోసమే ప్రత్యేకంగా తప్పుడు ప్రకటనలు ఇచ్చేవారు. వాటిని చూసి ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి ఓ వృద్ధుడు గతేడాది అక్టోబర్లో వీరిని కాంటాక్ట్ అయ్యాడు. తనకు పెండ్లి చేసుకోవాలని ఉందని, అమ్మాయిని చూపించాలని కోరాడు. దీంతో ఒక విడో అమ్మాయి ఉందని చెప్పి, దిల్‌సుఖ్‌నగర్​లోని గణేశ్ లాడ్జిలో పెండ్లి చూపులు ఆరెంజ్ చేశారు.

Also Read: Crime News: కారం చల్లి.. కత్తులతో అల్లుడు పై దాడి చేసిన అత్త, మామ

అయితే వృద్ధుడికి అమ్మాయి నచ్చడంతో పెండ్లి షాపింగ్​కోసం సికింద్రాబాద్​లోని ఆర్పీ రోడ్డుకు తీసుకెళ్లారు. అక్కడ రూ.1.77 లక్షల షాపింగ్​చేశారు. ఆ డబ్బులను బాధిత వృద్ధుడితోనే కట్టించారు ఆలేడి కిలాడీలు. అయితే ఆ తర్వాత త్వరలో పెండ్లి పెట్టుకుందామని చెప్పి, పత్తా లేకుండా పారిపోయారు. ఆ మహిళల ఫోన్ నంబర్లు కూడా స్విచ్చాఫ్ రావడంతో వృద్దుడు మహంకాళి పోలీసులకు అదే నెలలో ఫిర్యాదు చేశాడు. అయితే నిందితుల ఫొటోలు లేకపోవడం, పత్రికలో మ్యారేజ్ బ్యూరో నంబర్లు కూడా ఫేక్​కావడంతో వారిని ట్రేస్ చేయడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్లు మహంకాళి పోలీసులు తెలిపారు.

Also Read: Task force officers: గాడితప్పుతున్న టాస్క్ ఫోర్స్.. సంచలన కేసుల్లో కనిపించని ముద్ర!

 

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?