Abdullahpur Met mandal( iamge credit: swetcha reporter)
రంగారెడ్డి

Abdullahpur Met mandal: కబ్జాలపై కలెక్టర్‌ సీరియస్.. నాకేం సంబంధం లేదన్న ఎమ్మెల్యే!

Abdullahpur Met mandal: అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలంలో భూ కబ్జాలపై స్వేచ్ఛ పత్రికలో వచ్చిన కథనం ప్రకంపనలు సృష్టించింది. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని అనుచరులు చేస్తున్న కబ్జాలపై సర్వత్రా చర్చకు దారి తీసింది. ప్రభుత్వ భూముల కబ్జాపై జిల్లా కలెక్టర్‌తోపాటు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డిలు సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి సోమవారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.

బాట సింగారం గ్రామ పరిధిలోని అన్ని వివాదాస్పద భూముల్లోనూ విచారణ జరుపుతామన్నారు. సర్వే నంబర్‌ 10/95, 10/96లోని ప్రభుత్వ భూమిలో మల్‌ రెడ్డి రంగారెడ్డి కాలనీ అని పేరు పెట్టి ఎంఎల్‌ఏ అనుచరులం అని చెప్పుకుని కొంతమంది కబ్జాదారులు ప్లాట్లు చేసి అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో నిర్మాణాలను కూల్చివేసినట్లు చెప్పారు.

Also Read: MP Bandi Sanjay: అందాల పోటీలపై ఉన్న శ్రద్ద పుష్కరాలపై లేదా?.. ప్రభుత్వంపై బండిసంజయ్ ఫైర్!

ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలతో ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధంలేదని, ఎమ్మెల్యే పేరును వాడుకుని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తనను ఆదేశించినట్లు తహసిల్దార్‌ వివరించారు. అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలంలో ఉన్న 865.11 ఎకరాల ప్రభుత్వ భూమిలో సర్వే చేయగా 379.25ఎకరాల ఖాళీ భూమి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అన్ని భూములకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తామని, ఎవరైనా కబ్జాలకు పూనుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనాజ్‌ పూర్‌ గ్రామంలోని సర్వే నెంబర్‌ 281లో కబ్జా జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇరిగేషన్‌, రెవిన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేయడం జరిగిందని, సర్వే రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: Jangaon District Congress: కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?