Jangaon District Congress( image crtedit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Jangaon District Congress: కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు!

Jangaon District Congress: జనగామ జిల్లా కాంగ్రెస్ లో తారస్థాయికి చేరిన వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. జనగామలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంతో మరోసారి బయటపడిన విభేదాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు జనగామ కాంగ్రెస్ పార్టీ రాజకీయం నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ వర్సెస్ డిసిసి అధ్యక్షులు కుమ్మరి ప్రతాపరెడ్డి అన్నట్టుగా పొలిటికల్ వార్ మొదలైంది.

సోమవారం కాంగ్రెస్ నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తుండగా డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో, వివాదం మొదలైంది. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు, తోపులాటతో రణరంగాన్ని తలపించి,  అడ్డుకొని సర్దిచెప్పే ప్రయత్నం పోలీసులు చేసిన లాభం లేకుండా పోయింది.  అధ్యక్షుడు వర్గం పాత కార్యకర్తలను పట్టించుకోవడంలేదని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Medchal murder Case: ఆశ్రయమిస్తే అంతం చేశాడు.. మహిళ గొంతు, చెవి, ముక్కు కోసి.. దారుణం!

నియోజకవర్గ ఇన్చార్జ్, డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి కి తెలియకుండా చెక్కులు పంపిణీ చేయడం ఏంటని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసిసి దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట ఉదృత పరిస్థితి నెలకొంది. పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను చదరగొట్టడంతో సమస్య సద్దుమణిగింది. చెక్కులకోసం వచ్చిన లబ్ధిదారులు చెక్కులు తీసుకోకుండానే వెనుదిరిగారు. దీనిపై స్పందించిన కిరణ్ కుమార్ మాట్లాడుతూ లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు చెక్కులు మీ ఇండ్లకే తీసుకువచ్చి ఇస్తామని అన్నారు. గతంలోను అనేకసార్లు కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత వివాదాలు తలెత్తాయి. అధిస్థానం స్పందించి సమస్య పరిష్కారంకు కోసం తగిన చర్యలు తీసుకోవాలని జనగామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.

 Also Read: KTR on CM Revanth: పదివేల కోట్ల స్కాం.. రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదు.. కేటీఆర్ హెచ్చరిక!

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?