KTR on CM Revanth: పాతబస్తీ సంఘటనపై కేటీఆర్ ఆరా..
KTR on CM Revanth (imagecredit:twitter)
హైదరాబాద్

KTR on CM Revanth: పాతబస్తీ సంఘటనపై కేటీఆర్ ఆరా.. అవి ఉంటే ప్రాణ నష్టం తగ్గేది!

KTR on CM Revanth: హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన సంగటనపుడు ఆంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ఫైర్ ఇంజన్ లో నీళ్లు ఉంటే గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం తగ్గేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫైర్ బ్రిగేడ్‌కు సరైన మాస్కులు లేకపోవడంలో వాళ్లు లోపలికి వెళ్లి బాధితులను కాపాడలేకపోయారన్నారు. అందాలపోటీల మీద పెట్టిన శ్రద్ధ, ఇలాంటి మౌలిక సదుపాయల కల్పనపై పెడితే బాగుంటుందన్నారు. 125 సంవత్సరాల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలో 17 మంది చనిపోవడం హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరం అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుల్జార్ హౌస్ గురించి తెలియని వాళ్లు హైదరాబాద్, తెలంగాణలో ఎవరూ లేరు అని అన్నారు.

125 సంవత్సరాల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలోని 17 మంది చనిపోవడం మనసున్న ప్రతీ ఒక్కరిని కలిచివేసిందని, బాధిత కుటుంబ సభ్యులు ఎవరినీ నిందించడం లేదు. కాని వారు కొన్ని విషయాలు చెప్పారు. ఫైర్ బ్రిగేడు నీళ్లు లేకుండా వచ్చింది. ఫైర్ బ్రిగేడ్ వాళ్లు సరైన మాస్కులు లేకుండా రావడంతో లోపలికి వెళ్లలేకపోయారని అన్నారు. అంబులెన్స్ లలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేకపోవడం దారుణమని, ఈ కనీస సదుపాయలు ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతికేవని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారని అన్నారు. అగ్నిప్రమాదం జరగగానే స్థానికులైన హిందువులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో వచ్చి మమ్మల్ని కాపాడారని చెప్పారు. మాకు జరిగిన నష్టం రాబోయే రోజుల్లో ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నానని, భవిష్యత్తులో ఎవరు చనిపోకుండా చూడమని కోరారు.

Also Read: Jayashankar Badibata: స్కూళ్ల రీఓపెన్.. విద్యాశాఖ కీలక నిర్ణయం!

పాతబస్తీ అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రదేశం

నేను రాజకీయం చేయడానికి రాలేదు. ఎవరినీ విమర్శించడం లేదు. కాని ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల మీద రివ్యూ సమావేశం పెట్టుకోవాలని కేటిఆర్ తెలిపారు. పాతబస్తీ అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రదేశం ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ లు రావడానికి కూడా వీలుకాలేదు. అధికారులకు నిరంతరం ట్రైనింగ్ ఇవ్వాలని, తరుచుగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. ఇవేవి జరగలేదు. ఇది మంచిది కాదని అన్నారు. అంబులెన్స్ లు వచ్చాయి కాని అందులో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేకపోవడంతోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందని, ఎనిమిది మంది చిన్నారులు తమ కళ్లముందే చనిపోయారని చెపుతున్నారు.

ప్రాణాలు పోయిన తర్వాత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా చూడండి. అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ ఇలాంటి వాటిపై కూడా పెట్టండి. అందాల పోటీలపై పెట్టే ఖర్చు ఇలాంటి సందర్భాల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయలపై పెట్టండి అంటే కేటిఆర్ ఎద్దేవ వేశారు. సిఎం రేవంత్ రెడ్డి దగ్గరనే హోం, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. సంఘటన స్థలం దగ్గరికి రేవంత్ రెడ్డి వస్తే బాగుండేది.

Also Read: Gulzar House Fire Accident: ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్.. గుల్జార్ హౌస్‌లో ఇంత ఘోరం ఎలా జరిగింది?

ఐదు లక్షల నష్టపరిహారం సరిపోదు. ఇంటికి, వ్యాపారానికి తీవ్ర నష్టం జరిగిందని, 125 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంటున్న అగర్వాల్ కుటుంబం మళ్లీ తమ వ్యాపారం ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని అన్నారు. భాదితులకు 25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మా బీఆర్ఎస్ తరుపున కూడా ఆదుకునే ప్రయత్నం మేము చేస్తామని, రాజకీయం చేయడానికి రాలేదు. ఇలాంటి కడుపు కోత ఇంకెవరికి రాకూడదని వచ్చామని అన్నారు. ప్రభుత్వం ఇ విషయంలో మానవత్వంతో స్పందించాలని కేటీఆర్ కోరుతున్నానని అన్నారు.

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..