Hydraa demolition (imagecredit:swetcha)
హైదరాబాద్

Hydraa demolition: పుప్పాల గూడలో అక్రమ కట్టడాలు కూల్చివేత..!

Hydraa demolition: హైదరాబాద్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో హైడ్రా ఆక్రమణలను తొలగించింది. ప్రజా ఫిర్యాదుల దృశ్యా వచ్చిన ఫిర్యాదులను ఆదారం చేసుకొని పుప్పాల గూడ, హైదరనగర్లో కబ్జాలకు గురైన భూములకు విముక్తి లబించింది. కూకట్ పల్లి, హైదరనగర్లో 9 ఎకరాల hmda (గతంలో హుడా) లేఔట్లో కబ్జాను ఉదయం హైడ్రా తొలగించింది. అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్‌తో 9 ఎకరాల లేఅవుట్‌ను కబ్జా చేసి అంతకు ముందు అందులో ఉన్న ప్లాట్ హద్దులను డా. NDS ప్రసాద్ చెరిపేసాడు. మొత్తం 79 ప్లాట్లు, లేఔట్ ప్రకారం పార్కులు, రహదారులు కబ్జాకు గురి అయ్యాయని ప్లాట్ యజమానులు ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు.

దీంతో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు దశాబ్దాలుగా కోర్టులో కేసులు పెండింగ్ ఉంటుండగా అక్కడ స్థలాన్ని అద్దెలకు యిచ్చి నెలకు రూ.50 లక్షలకు పైగా అద్దె తీసుకుంటున్నాడంటూ ప్లాట్ యాజమానులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులతో క్షేత్ర స్థాయిలో గత బుధవారం పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ Hmda లేఔట్ తో పాటు పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్టు నిర్ధారణ చేసుకున్నారు. దీంతో ఆక్రమణల తొలగింపునకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం పోలీస్ బందోబస్తు మధ్య పుప్పాల గూడ, హైదర్ నగర్‌లో కబ్జాలను హైడ్రా తొలగించింది.

Also Read: Hydraa: అక్కడ మట్టి పోసారో అంతే సంగతి.. హైడ్రా సంచలన నిర్ణయం!

మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ

మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ లోని డాలర్ హిల్స్‌లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. లేఅవుట్లో కొంత భాగంతో పాటు రోడ్స్, పార్కును కబ్జా చేసి నిర్మాణాలు చేశాని, డాలర్ హిల్స్ ప్లాట్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాటిని కూల్చివేశారు. పాత లేఔట్‌ను రద్దు చేసి వ్యవసాయ భూమిగా మార్చి NCC సంస్థకు అమ్మిన సంతోష్ రెడ్డి ఇరుపక్షాలను పిలిచి విచారించిన తర్వాత పార్కు స్థలం, రహదారులు కబ్జాకు గురి అయినట్టు నిర్ధారించాడు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ నిర్మాణాలు చేస్తున్నట్టు తేలడంతో పనులు ఆపించి హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఆక్రమణలను తొలగించింది.

Also Read: Telangana: రీ-సర్వే తర్వాత వచ్చే సమస్యలు ఎలా?

 

 

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?