Re Survey Issues
తెలంగాణ

Telangana: రీ-సర్వే తర్వాత వచ్చే సమస్యలు ఎలా?

Telangana: డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మాడర్నైజేషన్ ప్రోగ్రాం(డీఐఎల్ ఆర్ ఎంపీ) మార్గదర్శకాలను అనుసరిస్తూ గ్రామాలలో రీ-సర్వే చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లో నేటి నుంచి రీ సర్వే చేసేందుకు ప్రత్యేక బృందాలు విజిట్ చేయనున్నాయి. అయితే రీ సర్వే ద్వారా నష్టాలు కూడా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. గ్రామాల్లో భూ పంచాయితీ సమస్యలు పెరిగే ప్రమాదం ఉన్నదని స్వయంగా రెవెన్యూ అధికారులే వెల్లడిస్తున్నారు. లాభాలు చాలా ఆలస్యంగా పొందుతుండగా, నష్టాలు మాత్రం తక్షణమే చూపుతాయని, తద్వారా ప్రభుత్వ మైలేజ్‌కు డ్యామేజ్ జరిగే ప్రమాదం కూడా ఉన్నట్లు అధికారుల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి గత ప్రభుత్వం కూడా సర్వే చేయాలని ప్లాన్ చేసింది. ఒకటి రెండు మండలాల్లో ఫైలట్ మోడ్‌లో స్టడీ చేసింది. ఆయా గ్రామాల్లో ఉత్పన్నమవుతున్న భూ సమస్యలను గుర్తించి, దాని పర్యావసనాలను అంచనా వేసి సర్వేకు వెనక్కి తగ్గింది. ఇప్పుడు భూ భారతితో మంచి పేరు పొందిన ఇందిరమ్మ సర్కార్.. మరో స్టెప్ ముందుకు వేసి భూములు రీ సర్వే అంటూ ప్రోగ్రామ్ చేపట్టింది. కానీ దీనితో ఇన్‌స్టెంట్‌గా ప్రభుత్వానికి నష్టం జరిగే ఛాన్స్ ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఆఫ్ ది రికార్డులో స్పష్టం చేస్తున్నారు.

Read Also- Hyderabad: భాగ్యనగర ప్రజలకు షాకింగ్ న్యూస్.. రోడ్డే కదా అని చెత్త వేస్తే?

Telangana Govt Re Survey

ఏం జరుగుతుందంటే…?
రికార్డుల ప్రకారం భూములు లేకపోవడం, భూమి విస్తీర్ణం ప్రకారం పొజిషన్‌లో లేక పోవడం, సర్వే నంబర్లలో మార్పులు, ల్యాండ్ కబ్జాలు, తదితర సమస్యలు ప్రస్తుతం నెలకొన్నాయి. ధరణి తర్వాత ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అధికారుల అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 నుంచి 45 శాతం భూములకు ఇలాంటి సమస్యలు ఉన్నట్లు రెవెన్యూ ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ సమస్యల్లో కుటుంబ సభ్యుల నుంచి, బంధువులు, బయటి వ్యక్తుల వరకు ఉన్నారు. పక్క పక్క పట్టాదారుల మధ్య సమస్య తీవ్రతరం ఎక్కువగా ఉన్నట్లు అంచాన వేశారు. సర్వే చేసి స్పష్టమైన వివరాలు తేల్చాలంటే పాత రికార్డులు, రైతుల పాస్ బుక్ లన్నీ మార్చాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో గ్రామ స్థాయిలో ఆందోళనలు, వ్యతిరేకతలు, ప్రభుత్వాన్ని బద్నాం చేసే అవకాశం కూడా ఉన్నది. తద్వారా ప్రభుత్వ గ్రాప్ క్రమంగా పడిపోయే ఆస్కారం ఉన్నది. పైగా కోర్టు కేసులు పడే ప్రమాదం ఉన్నది. దీంతో భూ పరిష్కారం పక్కకు పెడితే, సమస్య మరింత చిక్కు ముడిగా మారే ఛాన్స్ ఉన్నది. కోర్టు కేసులతో భూ పంచాయితీలు తెంచడం ప్రభుత్వానికీ సాధ్యపడే ఛాన్స్ తక్కువగా ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నారు.

Read Also- Tirupati: పవిత్ర పుణ్యక్షేత్రంలో మహా పాపం.. ఏం జరిగిందంటే?

ప్రత్యేక కమిటీకి ప్లాన్…?
రీ –సర్వే ద్వారా వచ్చే సమస్యలను ఎలా పరిష్కరిస్తారంటూ ప్రభుత్వం రెవెన్యూ శాఖను ఆరా తీసినట్లు తెలిసింది. ప్రధానంగా గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖకు సర్కార్ సూచించింది. దీంతో ప్రత్యేక కమిటీకి ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తుంది. ఫైలట్ ప్రాజెక్టులో తేలిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను తయారు చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజలు, రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిటీ ఈ ప్రాసెస్ ను లీడ్ చేయనున్నది. ధరణి వర్సెస్ భూ భారతి, మ్యూటేషన్లు వర్సెస్ రీ సర్వేలు పేరిట పంచాయితీ స్థాయిలో ప్రత్యేక ప్రోగ్రామ్‌కు రూప కల్పన చేయనున్నట్లు ఓ కీలక అధికారి తెలిపారు.

Lands Re Survey

Read Also- Vishnu Manchu: ప్రభాస్‌ను పొగుడుతూ.. మంచు మనోజ్‌పై విమర్శలు!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు