Sangareddy District: సంగారెడ్డి జిల్లాలో ఉగ్రమూలాల ఘటన కలకలం రేపుతోంది. ఇప్పటికే పాకిస్థానీలకు సిమ్ కార్డులు విక్రయించిన అస్సాం రాష్ట్రానికి చెందిన ఇస్లాంని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫోన్ ని సీజ్ చేసి కాల్ డేటా ఆధారంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఇస్లాంతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని గోప్యంగా విచారణ చేస్తున్నారు.
ఇస్లాం తెలంగాణకి వచ్చేటప్పుడు 10 సిమ్ కార్డులు తెచ్చినట్టు గుర్తించిన పోలీసులు.. ఒక్కో సిమ్ ని ఐడెంటిటీ ప్రూఫ్ లేకున్నా రూ.2 వేలకు విక్రయించినట్టు ఇస్లాం పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఇస్లాం పట్టుబడిన సమయంలో మొబైల్ లో ఉన్న సిమ్ తో పాటు మరో మూడు సిమ్ కార్డులే, దొరకడంతో మిగతా ఆరు సిమ్ కార్డులు ఎవరికి ఇచ్చారు అన్నదానిపైన ఆరా తీస్తున్నారు.
Also read: Shivraj Singh Chouhan: దేశానికి హాని తలపెడితే వదిలిపెట్టం.. కేంద్రమంత్రి వార్నింగ్!
పాకిస్థానీలకు తెలిసి సిమ్ కార్డులు విక్రయించాడా..? లేదా తెలియక విక్రయించాడా.. అన్న కోణంలోను దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇస్లాం అస్సాంలో మొబైల్ షాపులో పని చేసేటప్పుడు ఎన్ని నకిలీ సిమ్ లు తయారు చేశాడో గుర్తించే పనిలో ఉన్నారు అస్సాం పోలీసులు. అత్యంత గోప్యంగా కొనసాగుతున్న అస్సాం పోలీసుల ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ పేరుతో విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్ లో పేలుళ్లు సృష్టించటానికి ఉగ్రవాదులు చేసిన కుట్రను ఎన్ఐఏ అధికారులు ఛేదించారు. విజయనగరం, హైదరాబాద్ కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు పహల్గాంలో సృష్టించిన నరమేధానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ జరిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ తోపాటు పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను మన వైమానిక దళాలు ధ్వంసం చేశాయి.
దీంట్లో జైష్ ఏ మహ్మద్ గ్రూపునకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అజర్ మసూద్ కుటుంబ సభ్యులు పదిమందితోపాటు సన్నిహితులు చనిపోయారు. ఈ నేపథ్యంలో భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ అజర్ మసూద్ ప్రకటన చేసినట్టుగా వార్తలొచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్రాల నిఘా బృందాలతోపాటు ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు.
Also read: Manoj Counters Vishnu: శివయ్యా అని పిలిస్తే.. శివుడు రాడంటూ అన్న విష్ణుకు కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్
స్లీపర్ సెల్స్ గా పని చేస్తున్నవారు, గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి పట్టుబడిన వారు, వారి సన్నిహితులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉల్ రహమాన్, హైదరాబాద్ బోయిగూడ నివాసి సమీర్ తో కలిసి రాష్ట్ర రాజధానిలో పేలుళ్లు జరపటానికి కుట్రలు చేస్తున్నట్టుగా ఎన్ఐఏ అధికారులకు తెలిసింది. దాంతో అటు విజయనగరం, ఇటు తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలను ఎన్ఐఏ అధికారులు అప్రమత్తం చేశారు.
దాంతో రంగంలోకి దిగిన పోలీసులు సిరాజ్ ఉల్ రమమాన్, సమీర్ లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఐసిస్ అనుబంధ సంస్థ అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కు చెందిన హ్యాండ్లర్ల నుంచి వచ్చిన ఆదేశాలతో స్లీపర్ సెల్స్ గా ఉన్న ఈ ఇద్దరు పేలుళ్ల కుట్ర చేసినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో సిరాజ్ ఉల్ రహమాన్ ఇంటి నుంచి బాంబులు తయారు చేయటానికి ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు.