Miss World Contestants(image credit:X)
హైదరాబాద్

Miss World Contestants: సచివాలయం సందర్శన.. తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కారం!

Miss World Contestants: తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను ప్రత్యక్షంగా చూస్తుండటం, ప్రభుత్వ ఆతిథ్యానికి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న కంటెస్టెంట్లు ఫిదా అవుతున్నారు. ఆదివారం సాయంత్రం రాష్ట్ర పాలన కేంద్రం సచివాలయానికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు చేరుకున్నారు. సచివాలయం సాక్షిగా తెలంగాణ జరూర్ ఆనా అంటూ నినదించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు సచివాలయానికి వచ్చేందుకు రెడ్ కార్పెట్ తో ప్రభుత్వం స్వాగతం పలికింది. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ వినిపిస్తుండగా తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పార్చన చేశారు.

కంటెస్టెంట్ల అందరి సమక్షంలో 10 దేశాలకు చెందిన ప్రతినిధులు తెలంగాణ తల్లికి పుష్పాంజలి అర్పించారు.సెక్రటేరియట్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సుందరీమణులు సెల్ఫీలు తీసుకున్నారు. సచివాలయంలోని పరిసరాలు తిరిగారు. సచివాలయం లోపల లాన్స్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు మర్యాదపూర్వక తేనీటి విందును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం పాతబస్తీ గుల్జార్ హౌస్ ఫైర్ ఆక్సిడెంట్ మృతులకు సచివాలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, మంత్రులు, అధికారులు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

ఆకట్టుకున్న డ్రోన్ షో

సచివాలయంలో డ్రోన్ షో ఏర్పాటు చేశారు. ఆ షో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న కంటెస్టెంట్లను ఆకట్టుకుంది. ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలు, పథకాల అమలు తీరును డ్రోన్ షో తో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు పరిచయం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ రైజింగ్, సీఎం రేవంత్ రెడ్డి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు, రూ.500గ్యాస్, రైతే రాజు, రీజీవ్ ఆరోగ్యశ్రీ, చార్మినార్, ఇందిరమ్మ మహిళా శక్తి, మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించినవి ప్రదర్శించారు.

Also read: Telangana: రీ-సర్వే తర్వాత వచ్చే సమస్యలు ఎలా?

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ ఆకృతుల్లో డ్రోన్లతో ప్రదర్శన చేశారు. మువ్వన్నెల జెండా రంగుల్లో, విద్యుత్ కాంతులతో రాష్ట్ర సచివాలయం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మిస్ ఇండియా నందిని గుప్తా, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం సందర్శన

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళలు పిల్లలపై వేధింపుల నివారణ, డ్రగ్స్ కట్టడికి చేపట్టిన చర్యలు, నేరాల నియంత్రణ, నేర నివారణలో ఉపయోగిస్తున్న ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులు తదితర అంశాలపై తెలంగాణా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్టమైన చర్యలపట్ల మిస్ వరల్డ్ కాంటెస్టర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. డ్రగ్స్ నివారణకై తెలంగాణా పోలీస్ చేపట్టిన చర్యలకు తమ సంపూర్ణ మద్దతు తెలియ చేస్తూ పోస్టర్లపై సంతకాలు చేసి పలు మెసేజ్ లను కూడా రాశారు.

107 దేశాల మిస్ వరల్డ్ కాంటెస్టర్లు ఆదివారం బంజారా హిల్స్ లోని తెలంగాణా ఇంటిగ్రేటెడ్ కమండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి, రాష్ట్రంలో శాంతి భద్రతల రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విధానాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ లకు పోలీస్ అశ్విక దళం, పైపు బ్యాండ్, మోటర్ సైకిల్ రైడర్స్, స్నిప్పర్ డాగ్ స్క్వాడ్ లతో పోలీస్ శాఖ స్వాగతం పలికింది.

పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడిటోరియంలో ఈ కాంటెస్టర్లకు పోలీస్ శాఖ అమలు చేతున్న పలు విధానాలు, అవి పనిచేసే విధానంపై ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పటిష్టమైన విధానాలవల్ల రాష్ట్రంలో 17 శాతం నేరాలు తగ్గాయని, వివిధ అంశాలలో తెలంగాణా పోలీస్ కు అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయని వివరించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ట్రాన్స్ జెండర్ల సేవలను ట్రాఫిక్ విభాగం లో ఉపయోగించుకుంటున్నామని తెలిపారు.

సురక్షిత రాష్ట్రంగా తెలంగాణ

మొత్తం ప్రపంచానికే సవాలుగా మారిన సైబర్ నేరాల నియంత్రణలో అత్యంత ఆధునిక టెక్నాలజీ ని వాడుతున్నామని, లక్షల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ టీవీల వల్ల, రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా వెంటనే తగు చర్యలను చేపడుతున్నామని చెప్పారు. ముఖ్యంగా సేఫ్టీ టూరిజంలో తెలంగాణా అత్యంత సురక్షితమైనది , ఇందుకు తెలంగాణా పోలీస్ చేపట్టిన పటిష్టమైన చర్యలే కారణమని వివరించారు. దీని అనంతరం, తెలంగాణా పండగలు, సంస్కృతీ, సంప్రదాయాలను కళ్లు ముందించేలా శాస్త్రీయ నృత్య ప్రదర్శన జరిగింది.

Also read: Theatre Bandh: జూన్‌లో మళ్లీ థియేటర్ల రచ్చ.. ‘హరి హర వీరమల్లు’ వాయిదా తప్పదా?

ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన పోలీసు ఆయుధాల ప్రదర్శన, ఆక్టోపస్, గ్రే హౌండ్స్, పోలీస్ జాగిలాల ప్రదర్శనలు, పైప్ బ్యాండ్, అశ్విక దళం లను కాంటెస్టర్లు ఆసక్తిగా పరిశీలించారు. సెల్ఫీలను దిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను నిరంతరం పరిశీలించే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ గదిలో ఏర్పాటు చేసిన ఆధినిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సర్వేలెన్స్ ఫీడ్ లు, తక్షణమే స్పందించే వ్యవస్థను మిస్ వరల్డ్ కాంటెస్టర్లు స్వయంగా పరిశీలించారు.

జీవన ప్రమాణాలు పెంపొందించడం, సురక్షిత టూరిజంకు, రాష్ట్ర అభివృద్ధికి భద్రతా చర్యలు ఎంతటి కీలక పాత్ర వహిస్తాయో తెలంగాణా పోలీస్ ను ఉదాహరణ చెప్పవచ్చని మిస్ వరల్డ్ కాంటెస్టర్లు అభిప్రాయం వ్యక్తం చేసారు. అనంతరం, మరే రాష్ట్రంలో లేని విధంగా, ట్రాఫిక్ నియంత్రణా చర్యలకు సేవలందిస్తున్న ట్రాన్స్ జెండర్లతో కలసి మిస్ వరల్డ్ కంటెస్టర్లు ఫోటో దిగారు.

 

 

 

 

 

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?