Jr NTR: టైటిల్ చూడగానే ఇదేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. మీరు వింటున్నది నిజమే. నందమూరి వారసుడు, టాలీవుడ్ హీరో నందమూరి తారక రామారావు ఈసారి మహానాడుకు (Mahanadu) విచ్చేయనున్నారు! ఒకట్రెండు రోజుల్లో నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానం అందజేయనున్నట్లు టీడీపీ వర్గాల నుంచి సమాచారం. అయితే ఈ ఆహ్వానం వెనుక టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పెద్ద మాస్టర్ ప్లానే ఉందని రాష్ట్ర రాజకీయాల్లో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? నిజంగానే హరికృష్ణ వారసులకు ఆహ్వానం అందుతుందా? ఆహ్వానం అందితే నిజంగానే వస్తారా? అనేది ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అయ్యింది. అసలు ఈసారి మహానాడు ఎలా నిర్వహించబోతున్నారు? మెనూలో ఏయే వంటకాలు ఉండనున్నాయి? అనే విషయాలపై ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం..
Read Also- Samantha: వామ్మో.. వైఎస్ షర్మిలను ఇమిటేట్ చేసిన సమంత.. పెద్ద రచ్చే జరుగుతోందిగా!
చరిత్రలో నిలిచేలా..
తెలుగుదేశం పార్టీకి ‘మహానాడు’ అంటే పెద్ద పండుగే. ప్రతీ ఏటా లక్షలాది కార్యకర్తలు ఒకచోట కలుసుకొని అంగరంగ వైభవంగా వేడుక నిర్వహిస్తుంటారు. ఈసారి మాత్రం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచుకోట వైఎస్సార్ కడప జిల్లాలో మహానాడు జరగబోతోంది. కడపలోనే ఎందుకంటే పార్టీ పెద్దలు పలు కారణాలే చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికల్లో కంచుకోటను బద్దలు కొట్టిన టీడీపీ.. ఇప్పుడు పూర్తిగా పసుపుమయం చేయడానికి చేసిన ప్లానే ఇదని ధీమాగా చెప్పుకుంటున్నారు. మే 27, 28, 29 తేదీల్లో మూడ్రోజుల పాటు మహానాడు జరుగనుంది. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం జరగబోతోంది. 27న పార్టీ నిర్మాణం, సంస్థాగత అంశాలపై, 28న కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ మహానాడులో మునుపెన్నడూ లేని విధంగా రాయలసీమకు వరాలు ఉంటాయని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఇక ఆఖరి రోజు 29న మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. కాగా, 18, 19, 20 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో, 22, 23 తేదీల్లో జిల్లాల స్థాయిలో మినీ మహానాడులు జరగనున్నాయి. కడపలో నిర్వహిస్తున్న మహానాడు ఈసారి చరిత్రలో నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వంటల విషయానికొస్తే.. అల్పాహారం, మధ్యాహ్నం భోజనంలో 22 రకాల వంటకాలు ఉండనున్నాయి. ఈ ఏర్పాట్లన్నీ టీడీపీ జర్మనీ విభాగం చూసుకుంటోంది.
బుడ్డోడి సంగతేంటి?
ఈసారి మహానాడుకు బుడ్డోడు ఎన్టీఆర్ వస్తారని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. స్వయంగా యువనేత, మంత్రి నారా లోకేష్ ఆహ్వానం అందజేస్తారని సోషల్ మీడియాలో హడావుడి నడుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తప్పకుండా జూనియర్ హాజరవుతారని కొందరు అభిమానులు చెప్పుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కారణంగా ఎన్టీఆర్ రాలేరని, అయినా వచ్చి చేయడానికి ఏమీ లేదు కదా? అని ఆయన అనుచరులు, అత్యంత ఆప్తులు గుసగుసలాడుతున్నారట. అయితే ఎన్టీఆర్‌ను ఎలాగైనా సరే రప్పించాలని పక్కా స్ట్రాటజీతోనే సీబీఎన్ ఉన్నారని తెలిసింది. ఎందుకంటే.. ఇప్పటి వరకూ నారా-నందమూరి ఫ్యామిలీ మధ్య తీవ్ర మనస్పర్థలు ఉన్నాయని.. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేష్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయని టాక్ నడిచింది. ఈ మధ్యనే ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని స్పష్టంగా అటు ఎన్టీఆర్.. ఇటు టీడీపీ శ్రేణులకు స్పష్టంగా అర్థమైంది. ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీని లోకేష్ పట్టుకోగా.. మరో కార్యక్రమంలో టీడీపీ జెండాను కళ్యాణ్ రామ్ చేతబట్టారు. దీంతో విబేధాలు లేవనే చెప్పుకోవచ్చు. మరోవైపు నారా, నందమూరి ఇంట ఎలాంటి కార్యక్రమం జరిగినా, పుట్టిన రోజుకు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ విష్ చేస్తూ సఖ్యతగానే ఉన్నారు.
Read Also- AP Politics: ఏపీలో ‘హెలికాప్టర్’ ఫైట్.. కొంపదీసి ఇదంతా సంపద సృష్టేనా?
బాబు ప్లానేంటి?
ఏ నిమిషానికి ఏమి జరుగునో.. అన్నట్లుగా పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రానున్న ఎన్నికలకు టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో, తన ఆరోగ్యం ఏ మాత్రం సహకరిస్తుందో అని ఒకింత ఆలోచనలో పడ్డారట చంద్రబాబు. అందుకే నారా, నందమూరి కుటుంబాలను ఒక్కటి చేయాలని.. ముఖ్యంగా ఎన్టీఆర్, లోకేష్‌లను ఒకటి చేస్తే మరో రెండు, మూడు దఫాలు టీడీపీకే ఎదురే ఉండదని భావిస్తున్నారట. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం ఇచ్చినా సరే వైసీపీ బలపడిపోతుందని.. ఇలా జరగకుండా ఉండాలంటే ఎన్టీఆర్‌ను మహానాడుకు ఆహ్వానించి, లోకేష్ పక్కనే కూర్చోబెట్టి.. ఆయనతో ప్రత్యేకంగా ప్రసంగం కూడా ఇప్పించాలన్నది ప్లానట. ఇదే జరిగితే తనకూ పార్టీలో గౌరవం ఇస్తున్నారని, క్రియాశీలంగా ఉండాలనే ఆలోచన బుడ్డోడికి వస్తుందని టీడీపీ నేతలు కొందరు భావిస్తున్నారట. ఇంకా చెప్పాలంటే లోకేష్, ఎన్టీఆర్ కలిస్తే ఏపీ ముఖచిత్రం, రాజకీయ సమీకరణలే పూర్తిగా మారిపోయే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జూనియర్.. అలా మహానాడుకు వచ్చి ఇలా వెళ్లిపోతానంటే మాత్రం కుదరదు. ఆ తర్వాత ఇక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే అన్నట్లుగా అభిమానులు సైతం కోరుకుంటున్నారు. మరోవైపు బుడ్డోడు ఇప్పట్లో సినిమాలను వదిలేందుకు రెడీగా లేరు. అయినా ఇప్పట్లో టీడీపీకి ఎన్టీఆర్ అవసరం.. ఎన్టీఆర్‌కు టీడీపీ అవసరం ఇసుమంత కూడా లేదని.. ఇవన్నీ పగటి కలలే అన్నట్లుగా కొందరు విశ్లేషిస్తున్నారు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలంటే ఈనెలాఖరు వరకూ వేచి చూడాల్సిందే మరి.
Read Also- YS Jagan: ప్చ్.. సొంత జిల్లాలో పరువు పోగొట్టుకున్న వైఎస్ జగన్!