Samantha And YS Sharmila
Viral

Samantha: వామ్మో.. వైఎస్ షర్మిలను ఇమిటేట్ చేసిన సమంత.. పెద్ద రచ్చే జరుగుతోందిగా!

Samantha: టైటిల్ చూడగానే ఇదేంట్రా బాబోయ్ అని అనిపించిందా? అవునండోయ్ మీరు వింటున్నది అక్షరాలా నిజమే. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డిని (YS Sharmila Reddy).. స్టార్ హీరోయిన్ సమంత ఇమిటేట్ చేసింది. అటు రాష్ట్ర రాజకీయాల్లో, ఇటు సోషల్ మీడియాలో (Social Media) ఇప్పుడిదే పెద్ద చర్చ నడుస్తున్నది. ఇక కామెంట్స్ అంటారా అబ్బో.. మాటల్లో చెప్పలేం, రాతల్లో రాయలేం అలా ఉంది పరిస్థితి. ఇంతకీ సమంత ఏమన్నది? ఎందుకిలా ఇమిటేట్ చేశారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వైరల్ న్యూస్‌లో తెలుసుకుందాం.. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి…

Read Also- YS Jagan: వైఎస్ జగన్ మళ్లీ పాదయాత్ర.. అవసరమేనా?

ఈ డైలాగ్స్ గుర్తున్నాయా?
వైఎస్ షర్మిల పేల్చిన డైలాగ్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి కదా.. ఏంటి గుర్తు రావట్లేదా? అవేనండోయ్ పాదయాత్ర, ఆడపిల్ల డైలాగ్స్.. ఆ ఇవే. పాదయాత్ర అంటే ఏంటి..? పాదాల మీద నడిచే యాత్ర అని అర్థం. ఆడ పిల్ల పుట్టగానే ఆడ.. పిల్ల అంటారు.. ఎందుకంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని అర్థం. చిన్నాన్న అంటే ఎవరో తెలుసా? చిన్నప్పుడు ఎత్తుకొని పెంచే నాన్న. రైనీ సీజ్ అంటేనే రైన్‌ వచ్చే సీజన్ (వానలు పడే కాలం). మీ ఆవిడను మీ ఆవిడే అని ఎందుకు అంటున్నారో తెలుసా? మీ ఆవిడ కాబట్టి. స్టూడెంట్స్ అని వారిని ఎందుకు అంటున్నామంటే.. వాళ్లు యువత కాబట్టి. ఇలా ఒకటా రెండా షర్మిల నోట జాలువారిన డైలాగ్స్ ఇంకెన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికీ మరిచిపోరు.. మరిచిపోలేనివి కూడా. వీటిని యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ఎప్పుడు చూసిన నవ్వు ఆగదు అంతే. సరిగ్గా ఇదే ట్రెండ్‌ ఆ మధ్య ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో నడుస్తున్నది. దీన్నే ఇప్పుడు ఈ ట్రెండ్‌నే సినిమాల్లో కూడా తెగ వాడిపడేస్తున్నారు.

YS Sharmila

ఇదీ అసలు సంగతి..
షర్మిల మాటలను గట్టిగానే సమంత ఇమిటేట్ చేసేసింది.. ఇదంతా ఏ ఇంటర్వ్యూలోనో, లేదంటే స్టేజీ మీదనో జరగలేదండోయ్. జస్ట్ ఇదంతా జరిగింది సినిమాలో మాత్రమే. ఇటీవలే ఈ బ్యూటీ నిర్మాతగా వ్యవహరించిన, గెస్ట్ రోల్‌లో నటించిన ‘శుభం’ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కామెడీ పాత్రలో నటించిన ఈ బ్యూటీ.. ఇద్దరి మధ్య జరిగిన సన్నివేశాలు అప్పట్లో షర్మిల మాట్లాడిన మాటలను గుర్తుచేస్తున్నాయి. సినిమాలో సామ్ సరదాగా మాట్లాడుతూ.. ‘సమస్య’.. సమస్యను సమస్యే అని ఎందుకంటారో తెలుసా? ఇంతలో పక్కనుండే మరో వ్యక్తి ‘సమస్య’ కాబట్టి సమస్య అంటారని చెబుతాడు. అలా కోపంగా చూసినా ఈ బ్యూటీ సమస్యను విడదీసి మరీ అర్థం చెబుతుంది. సమస్యలో ‘సమ్’ అంటే సమాంతరంగా.. ‘అస్’ అంటే అందరూ.. ‘స్య’ అంటే ఎగిరిపోతారు అని అర్థం. ఇంతలో మేడమ్ ‘ఇప్పుడు’ అని ఎదురుగా ఉండే వ్యక్తి ఏదో చెప్పబోతాడు.. ఇంతలోనే సామ్ కలుగజేసుకుని ‘ఇప్పుడు’ అంటే.. ఏంటని అర్థం చెబుతుంది. ఇప్పుడులో ‘ఇప్పు’ అంటే ఈ పరిస్థితులు.. ‘ఉడు’ అంటే యూ డూ అని అర్థం అని బ్యూటీ సమంత చెబుతుంది.

Subham Movie

ఈ రెండే హాట్ టాపిక్..
సమస్య, ఇప్పుడు ఈ రెండు మాటలు విన్నంత సేపూ థియేటర్లలో జనాలు పగలబడి నవ్వుకున్నారు. ఈ మాటలు వినగానే అందరి మైండ్‌లో టక్కున వైఎస్ షర్మిల గుర్తుకొచ్చేస్తారు అంతే. ఆఖరికి షర్మిలక్కను ఇలా కూడా ఇమిటేట్ చేస్తున్నారా? అంటూ నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు. ఇక ఏపీలో రాజకీయ నేతలు అంటారా.. వావ్ షర్మిల సినిమాల్లోకి ఎక్కిందబ్బా అంటూ సరదాగా నవ్వేసుకుంటున్నారు. వాస్తవానికి ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగానే కామెడీ షోలో స్కిట్లు, సినిమా డైలాగ్స్, కామెడీని డైరెక్టర్లు ఫాలో అయిపోతున్నారు. ఈ ‘శుభం’ సినిమాలోనూ ట్రెండ్‌కు తగ్గట్టుగా సమంతతో ఇలా సరదాగా డైరెక్టర్ చెప్పించాడు. ఏదైతేనేం ఇదంతా సీరియస్‌గా తీసుకోవాల్సిన అక్కర్లేదు. అదేదో అంటారే సినిమాను సినిమాగా చూడాలని.. అలాగే కామెడీని కామెడీగా మాత్రమే చూడాలి అంతే.

 

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం