Virat Kohli (Image source: Twitter)
స్పోర్ట్స్

Virat Kohli: కోహ్లీని బీసీసీఐ ఇబ్బంది పెట్టిందా? రిటైర్మెంట్ వెనక షాకింగ్ నిజాలు!

Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన రెండు మూడు రోజులకే కోహ్లీ సైతం టెస్టులకు వీడ్కోలు పలకడం అభిమానులను షాక్ కు గురిచేస్తోంది. కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని ఫిట్ నెస్ కలిగిన కోహ్లీ.. అంత త్వరగా రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమెుచ్చిందని మాజీలు, క్రీడా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అయితే కోహ్లీ రిటైర్మెంట్ కు ఇదే కారణమంటూ ఎన్నో కథనాలు బయటకు వచ్చాయి. అయితే బీసీసీఐ ఇబ్బంది పెట్టడం వల్లే విరాట్ టెస్టులకు గుడ్ బై చెప్పినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కెప్టెన్సీ అడిగినా ఇవ్వలేదా?
విరాట్ కోహ్లీ కంటే ముందే రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పాడు. అప్పటివరకూ టెస్టులకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ తప్పుకోవడంతో.. ఆ స్థానాన్ని తనకు ఇవ్వాలని బీసీసీఐని కోహ్లీ కోరినట్లు క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇందుకు బీసీసీఐ నిరాకరించినట్లు తెలుస్తోంది. టెస్ట్ క్రికెట్ భవిష్యత్ దృష్ట్యా యంగ్ క్రికెటర్ కు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ విరాట్ కోహ్లీకి తేల్చి చెప్పినట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది విరాట్ ను మనసును బాధ పెట్టిందని కూడా చెబుతున్నారు.

రంజీ ఆడాలనే రూల్!
బీసీసీఐ టెస్టుల విషయంలో గతంలో ఒక నిబంధన తీసుకొచ్చింది. టీమిండియా తరపున టెస్టులు ఆడేవారు తప్పనిసరిగా రంజీల్లో ఆడాల్సిందేనని పేర్కొంది. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ.. భార్య, కూతురుతో కలిసి లండన్ లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ల సమయంలో మాత్రమే ఇండియాలో ఉంటున్నాడు. తర్వాత లండన్ కు వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు టెస్టుల్లో కొనసాగితే లండన్ నుంచి వచ్చి రంజీలు ఆడాల్సి వస్తుందని కోహ్లీ భావించినట్లు తెలుస్తోంది. ఈ కారణం కూడా అతడి రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జట్టు నుంచి తప్పిస్తారన్న భయం!
బీసీసీఐ హెడ్ కోచ్ గా గంభీర్ వచ్చినప్పటి నుంచి జట్టు సెలక్షన్ లో దూకుడు వ్యవహరిస్తున్నారు. ఫామ్ లో ఉన్న వారికి అవకాశాలు ఇస్తూ.. ఫెయిల్ అవుతున్న ప్లేయర్స్ ను పక్కన పెట్టేస్తున్నాడు. అయితే కోహ్లీ గత కొంతకాలంగా టెస్టు క్రికెట్ లో ఫామ్ లో లేడు. కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలుస్తుండటంతో టెస్ట్ జట్టులో అతడు కొనసాగుతున్నాడు. ఇప్పుడు రోహిత్ సైతం రిటైర్ కావడంతో టెస్టు జట్టులో చోటుపై కోహ్లీకి అనుమానాలు మెుదలైనట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఫామ్ లో ఉన్నవారికే తమ తొలి ప్రాధాన్యత అని బీసీసీఐ కూడా స్పష్టం చేస్తుండటంతో కోహ్లీ ఆలోచనలో పడినట్లు సమాచారం. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

Also Read: Ram Pothineni: పవన్ ఫ్యాన్స్ బాటలో రామ్ పోతినేని.. పిఠాపురం సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?

నాలుగేళ్లుగా కనిపించని విరాట్ మార్క్!
రన్ మెషిన్ గా పేరున్న విరాట్ కోహ్లీ గత నాలుగేళ్లుగా పూర్ ఫామ్ తో ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్నాడు. స్పిన్ ను ధాటిగా ఎదుర్కొనే కోహ్లీ స్వదేశంలో జరిగే మ్యాచ్ ల్లోనూ తడబడుతున్నాడు. విదేశాల్లో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ వద్ద పడిన బంతులకు ప్రతిసారి ఔట్ అయిపోతున్నాడు. గత 4 ఏళ్లలో 39 టెస్టులు ఆడిన విరాట్.. 30.72 సగటుతో 2,028 పరుగులు మాత్రమే సాధించాడు. మెుత్తం 69 ఇన్నింగ్స్‌లలో కేవలం 3 సెంచరీలు.. 9 అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. దీంతో టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్.. 54 నుంచి 47 కి దిగిపోయింది.

Also Read This: Boycott Countries: భారతీయుల బాయ్ కాట్ అస్త్రం.. టర్కీ తరహాలో చావుదెబ్బ తిన్న దేశాలు ఇవే! 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు