Boycott Countries: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు దేశాల మధ్య మినీ యుద్ధమే జరిగింది. ఆ సమయంలో పాక్ కు టర్కీ అండగా నిలవడంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి వ్యాపారస్తులు టర్కీ (Boycott Turkey) దేశానికి చెందిన ఆపిల్స్ (Apples), మార్బుల్స్ (Marbles) పై నిషేధం సైతం విధించారు. అదే సమయంలో టర్కీ టూరిజాన్నిసైతం భారతీయులు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భారతీయులు ఇలా బాయ్ కాట్ నినాదం తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలు దేశాలపై బాయ్ కాట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
టర్కీ (2020)
టర్కీపై వస్తువులను గతంలోనూ భారతీయులు బాయ్ కాట్ చేశారు. 2020లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ (Recep Tayyip Erdoğan) కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ (Pakisthan)కు మద్దతు ఇచ్చినప్పుడు దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. కొంతమంది వ్యాపారులు టర్కీ ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న స్థాయిలో మాత్రం ఈ బాయ్ కాట్ ఉద్యమం జరగలేదు. దీంతో టర్కీకి పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లలేదు.
చైనా (2020)
2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా సరిహద్దు ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చైనాతో ఘర్షణలో 20 మంది భారత సైనికులు సైతం మరణించారు. దీంతో డ్రాగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారతీయులు.. #BoycottChina అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక ఉద్యమానికి తెరలేపారు. చైనా నుండి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బట్టలు, బొమ్మలు, ఇతర వస్తువులను కొనుగోలు చేయకూడదని ప్రజలు పిలుపునిచ్చారు. ఆ సందర్భంలోనే ‘వోకల్ ఫర్ లోకల్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి ప్రచారాలు ఊపందుకున్నాయి. అటు భారత్ సైతం ఆ సమయంలోనే TikTok, WeChat, UC Browser సహా 200కు పైగా చైనా యాప్‌లపై నిషేధం విధించింది.
కెనడా (2023-2024)
ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించి 2023-2024 మధ్య భారత్ – కెనడాకి మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ లో చీలికలను ప్రోత్సహిస్తున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులకు కెనడా అండగా నిలవడాన్ని భారతీయులు సహించలేకపోయారు. దీంతో కెనడా వస్తువులను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అది విస్తృతమైన ఉద్యమంగా మారలేదు.
మాల్దివులు (2024)
2024లో మాల్దీవుల రాజకీయ నాయకులు.. స్థానిక మీడియాలో ప్రధాని మోదీ (PM Modi) గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది భారత్‌లో తీవ్రమైన ఆగ్రహానికి దారితీసింది. మాల్దీవులు భారత్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఈ వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో #BoycottMaldives హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. మాల్దీవులను గణనీయంగా విజిట్ చేసే భారతీయులు అక్కడ టూరిజాన్ని బహిష్కరించింది. దీంతో మాల్దీవుల పర్యాటకంపై పెను ప్రభావం పడింది. అదే సమయంలో భారత్ లోని లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు పర్యాటకుల రద్దీ పెరిగింది.
Also Read: Gold Rate Today : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..
పాకిస్థాన్‌పై ఎప్పుడూ బాయ్ కాటే!
భారత్-పాకిస్తాన్ మధ్య దీర్ఘకాల ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ ఉత్పత్తులు లేదా సేవలపై అనధికారిక బాయ్‌కాట్ ఎల్లప్పుడూ ఉంది. అయితే రెండు దేశాల మధ్య వాణిజ్యం చాలా పరిమితం కాబట్టి ఇది స్పష్టమైన బాయ్ కాట్ ఉద్యమంగా కనిపించదు. క్రికెట్ మ్యాచ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలను పాక్ నిర్వహించడాన్ని బీసీసీఐ తదితర భారతీయ సంస్థలు ఇప్పటికే నిషేధించాయి. తాజాగా సింధు జలాల ఒప్పందాన్ని సైతం భారత్ బ్రేక్ చేసింది.