Ram Pothineni: టాలీవుడ్ స్టార్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస హిట్స్ కొట్టిన ఈ హీరో గత కొన్నాళ్ల నుంచి కథలను ఎంచుకోవడంలో విఫలమవుతున్నట్లు తెలుస్తుంది. పైగా మాస్ సినిమాలు చేస్తున్న కూడా ఆడియెన్స్ ను మెప్పించలేక పోతున్నాడు. ఇక ఇలా కాదు లే అని తన రూట్ మార్చుకుని చాక్లెట్ బాయ్ గా మన ముందుకు రానున్నాడు. మహేష్ బాబు డైరక్షన్ లో రామ్ 22 వ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు. రామ్ కి జోడిగా.. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా గా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
Also Read: Preity Zinta: ఆ క్రికెటర్ ను పెళ్లి చేసుకో అన్న ప్రశ్నకి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రీతి జింతా
ఈ చిత్రంలో ఉపేంద్ర ఒక హీరోగా, రామ్ ఆ హీరో ఫ్యాన్ కనిపించబోతున్నాడు. ఈ రోజు రామ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు. అయితే, ఈ మూవీకి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ ఖరారు చేశారు. అలాగే, బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. గ్లింప్స్ చూస్తుంటే రామ్ హిట్ కొట్టేలాగే ఉన్నాడు. పైగా ” ఆంధ్ర కింగ్ తాలూకా” అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టుకున్నాడు.