Song Viral | పాటలోనూ తగ్గేదేలే అంటున్న సమంత
Actress Samantha Reacted To The Pushpa Item Song
Cinema

Song Viral : అందులోనూ తగ్గేదేలే అంటున్న సమంత

Actress Samantha Item Song From Pushpa Hits 200 Million Views On Youtube: టాలీవుడ్‌లో పుష్ప ద రైజ్ మూవీ పాన్‌ ఇండియా రేంజ్‌లో ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఇక ఈ మూవీలో హీరోయిన్ సమంత చేసిన ఐటమ్ సాంగ్ అటు ఆడియెన్స్‌ని ఉర్రూతలూగించింది. అంతేకాదు యూట్యూబ్‌ని సైతం షేక్ చేసిన సాంగ్‌గా హిస్టరీని క్రియేట్ చేసింది. ఆ సాంగ్‌ దుమ్ములేపుతూ తన మ్యానియాని ఇప్పుటికి అలాగే కొనసాగిస్తుంది. అంతేకాదు అప్పట్లోనే యూట్యూబ్‌లో భూకంపం పుట్టించింది ఈ సాంగ్‌. రిలీజైన 68 రోజుల్లోనే యూట్యూబ్​లో ఆ పాటకు 20 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘ఊ అంటావా? ఉఊ అంటావా’ సాంగ్ మ్యూజిక్ వింటూ పాన్‌ ఇండియా వ్యాప్తంగా తెగ ఎంజాయ్ చేశారు.

యూట్యూబ్​లో ఇంత తక్కువ టైంలో ఇన్ని భారీ వ్యూస్ సాధించిన ఏకైక సాంగ్‌గా ‘ఊ అంటావా? ఉఊ అంటావా’ రికార్డు పుటల్లోకి ఎక్కి తగ్గేదేలే అనిపిస్తోంది. ఈ సాంగ్​లో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ అప్పియరెన్స్​ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిపోయారు. అంతేకాదు ఈ సాంగ్ బాగా నచ్చింది. తక్కువ రోజుల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన పాటగా పుష్ప ఐటమ్ టాప్‌-1గా నిలిచింది. ఇక సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటి శ్రీలీల సూపర్ హిట్ మూవీ గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ 78 రోజుల్లోనే 20 కోట్ల వ్యూస్‌ను సాధించి ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది.

Also Read:గేమ్‌ ఛేంజర్ మూవీ షెడ్యూల్ రివీల్‌, ఎక్కడంటే..?

ఇక అదే వరుసలో ఐకాన్ స్టార్‌ బన్నీ, హీరోయిన్ పూజాహెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన బుట్టబొమ్మ బుట్టబొమ్మ సాంగ్ 95 రోజుల్లో 20 కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. కొరియోగ్రఫీ, టేకింగ్ హైలైట్ గా ఉండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకోవడం విశేషం. యూట్యూబ్ యూజర్స్ పెరిగిపోవడం, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వస్తుండటం, స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగిపోవడంతో త్వరలోనే పుష్ప2లో సాంగ్స్‌ ఈ రికార్డులన్నీ చెరిపేయనున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Just In

01

Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది