Swetcha Effect: స్వేచ్ఛలో మంగళవారం ప్రచురితమైన మంత్రివర్యా..! పట్టించుకోరా..? రాష్ట్రస్థాయిలో విస్తృత స్పందన లభించింది. ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో మల్టీ నేషనల్ కంపెనీల మొక్కజొన్న విత్తనాలతో సేద్యం చేసిన రైతులు తీవ్ర నష్టానికి లోనయ్యారు. గత 73 రోజులుగా వెంకటాపురం వాజేడు మండల కేంద్రాల్లో నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలతో దద్దరిల్లింది. అదేవిధంగా సోమవారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతులు పరిహారం కోసం గొంతేత్తారు.
జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ మంత్రి పర్యటనలో భాగంగా మంగపేట మండలంలో సందర్శించే క్రమంలో రైతుల ఆందోళనతో హుటాహుటిన కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. నష్టపరిహారం కోసం మేము చేయాల్సినంత కృషి చేశాం. కానీ కంపెనీల ఆర్గనైజర్లు మొండికేస్తున్నట్లుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్యా..! పట్టించుకోరా…? రాష్ట్రస్థాయిలో చర్చ జరగడంతో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మల్టీ నేషనల్ కంపెనీల జిఎంలతో మాట్లాడారు. గురువారం సెక్రటేరియట్ లో నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు.
Also Read: Maoist Party: మేము శాంతి చర్చలకు సిద్ధం…కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనా? స్పష్టం చేయాలి!
దీంతో మల్టీ నేషనల్ కంపెనీల జిఎంలు, ఆర్గనైజర్లు, ఆదివాసి నవనిర్మాణ సేన బాధ్యులు, రైతులు హాజరుకానున్నారు. ఈ సమావేశం తో రైతులకు పూర్తి పరిహారం వందే విధంగా తాడోపేడో తేల్చేస్తామని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి వెల్లడించినట్లుగా విశ్వసనీయ సమాచారం. సింజంట కంపెనీకి చెందిన గొడవర్తి నరసింహమూర్తి కారణంగానే ఇతర కంపెనీల ఆర్గనైజర్లు, కంపెనీల జిఎంలు పరిహారం ఇచ్చేందుకు కొంత నిర్లక్ష్యం వహిస్తున్నట్లుగా తెలిసిందని చైర్మన్ సూచనప్యంగా తెలిపినట్లు సమాచారం.
Also Read: Mahabubabad district: రైతులకు 21 వేల కోట్లతో రుణమాఫీ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు!
గొడవర్తి నరసింహమూర్తి పై రైతులకు చేసిన మోసాలకు సంబంధించి పిడి యాక్ట్ కేసు నమోదు చేయాలని రైతులు, ఆదివాసి నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి విజ్ఞప్తి చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో గొడవర్తి నరసింహమూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. గొడవర్తి నరసింహమూర్తి చర్యలతోనే అటు అధికారులు, ప్రజా ప్రతినిధులు రైతులకు పరిహారం చెల్లించడానికి ముందుకు రావడం లేదని సమాచారం. జిల్లా కలెక్టర్ దివాకరా టిఎస్ స్వయంగా రైతులను నట్టేట ముంచుతున్న గొడవర్తి నరసింహమూర్తి పై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు