HMDA: నిధుల సమీకరణ కోసం త్వరలోనే భూములను అమ్మాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పీకల దాక అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న సర్కారు అభివృద్ది, నిర్వహణ వ్యయంతో నిధులను సమీకరించేందుకు సిద్ధమైంది.
హెచ్ఎండీఏ, సర్కారు భూములకు వేలం పాటను నిర్వహించిన కొన్నింటిని ఏకంగా విక్రయించేందుకు మరి కొన్నింటిని లీజుకు ఇచ్చేందుకు కన్సల్టెన్సీలను నియమించుకునేందుకు హెచ్ఎండీఏ ప్రస్తుతం అర్హత కల్గిన కన్సల్టెన్సీల నుంచి బిడ్ లను ఆహ్వానిస్తుంది.
హెచ్ఎండీఏ ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ కూడా జారీ చేసి, ఈ నెల 27వ తేదీ వరకు కన్సల్టెన్సీల నుంచి బిడ్ లను స్వీకరించనున్న హెచ్ఎండీఏ వచ్చే నెల మొదటి వారంలో కన్సల్టెన్సీల నియామకాన్ని పూర్తి చేసుకోనుంది.
Also read: Dayakar On Eatala: కేసీఆర్‌ను రక్షించేందుకే బీజేపీలోకి.. ఈటలపై కాంగ్రెస్ నేత ఫైర్
ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించేందుకు ఇప్పటికే సర్కారు ప్రతిపాదించిన పలు ప్రాజెక్ట్టులకు నిధులను సమీకరించుకునేంనదుకు హెచ్ఎండీఏ భూముల అమ్మకానికి వెళ్తున్నట్లు సమాచారం. గ్రేటర్ బయట, ఔటర్ రింగ్ రోడ్డులో లోపలనున్న సర్కారు, హెచ్ఎండీఏ భూములనే ఎక్కువగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
కన్సల్టెన్సీ ఏం చేస్తుంది?
భూమి వినియోగాన్ని బట్టి ఏ భూమి విక్రయించాలి, లేకుండా లీజుకిస్తే బాగుంటుందా? లీజుకు ఇవ్వాలా? ఇవ్వాలనుకుంటే వచ్చే ఆదాయం ఎంత? అందుకు ఎంతకాలం లీజుకివ్వాలి? ఈ లీజుకు ఇచ్చే కాల పరిమితి, ఆదాయం మౌలిక వసతులు కల్పించే ప్రాజెక్టులకు ఏ మేరకు సరిపోతుందన్న విషయాలపై ఎంపికైన కన్సల్టెన్సీ అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది.
అధ్యయనం చేసి కన్సల్టెన్సీలు హెచ్ఎండీఏకు నివేదికలను సమర్పించిన తర్వాత తుది ఎక్కడెక్కడి భూములు విక్రయించాలి, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏమిటీ? ఎక్కడి భూములు అమ్మితే మంచి రేటు వస్తుందన్న విషయాలపై కన్సల్టెన్సీలిచ్చే నివేదిక ప్రకారం హెచ్ఎండీఏ సర్కారు అనుమతి తీసుకుని ముందుకెళ్లే అవకాశాలున్నాయి.
ముఖ్యంగా ఎంపికైన కన్సల్టెన్సీలు ప్రభుత్వ భూములకు ఆయా ప్రాంతాల వారీగా ఉన్న మార్కెట్ రేట్ల ప్రకారం భూముల వివరాలు, వాటి ఏరియా, ప్రాధాన్యంగా గుర్తించాల్సి ఉంటుంది. హెచ్ఎండీఏ భూముల వివరాలు సేకరించి, వాటి యాజ మాన్య హక్కులు, జోనింగ్ నిబంధనలు, భూ వినియోగం, అక్కడే ఏ రకమైన నిర్మాణాలు చేపట్టవచ్చు, ప్రస్తుత మౌలిక వసతులు, రానున్న 30 ఏళ్లలో అవసరమైన మౌలిక సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించి, ధృవీకరించాల్సి ఉంటుందని సమాచారం.
Also read: Tollywood Star Heroine: తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. ఇంతకీ ఈ హాట్ బ్యూటీ ఎవరంటే?
అలాగే మాస్టర్ ప్లాన్లు, రోడ్ల విస్తరణ, అభివృద్ధి నియంత్రణ నిబంధనలపై సమీక్షించి, అభివృద్దికి అవసరమైన అనుమతులు, వాటి పరిమితులను గుర్తి,చిన తర్వాతే భూముల విక్రయంపై హెచ్ఎండీఏ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.