CBSE 12th Results 2025: దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. సీబీఎస్ఈ (CBSE) తన 12వ తరగతి బోర్డ్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షల్లో 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు బోర్డ్ ప్రకటించింది. ఫలితాలను తమ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని సూచించింది.
విజయవాడ టాప్
రీజియన్ల పరంగా ఉత్తీర్ణత శాతం తీసుకుంటే విజయవాడ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు సీబీఎస్ఈ బోర్డ్ ప్రకటించింది. 99.60 శాతం పాస్ పర్సంటేజ్ దక్కించుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత కేరళలోని తిరువనంతపురం (99.32 శాతం), తమిళనాడులోని చెన్నై (97.39 శాతం) ఉత్తీర్ణత సాధించి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయని తెలిపింది.
మార్క్స్ ఇలా పొందండి..
సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు తాము సాధించిన స్కోరును cbse.gov.in, https://cbseresults.nic.in/, results.cbse.nic.in వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చని బోర్డ్ స్పష్టం చేసింది. రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్‌లను ఎంటర్ చేయడం ద్వారా మార్క్స్ పొందవచ్చని తెలియజేసింది.
ఎస్ఎంస్ ద్వారా తెలుసుకోవాలంటే!
మెుబైల్ ద్వారా కూడా 12వ తరగతి ఫలితాలను పొందే అవకాశాన్ని సీబీఎస్ఈ కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా 7738299899 మెుబైల్ నెంబర్ ను కేటాయించింది. ఈ నెంబర్ కు CBSE12 <రోల్ నెంబర్> <స్కూల్ నెంబర్> <సెంటర్ నెంబర్> టైప్ చేసి పంపిస్తే ఎస్ఎంస్ రూపంలో మార్క్స్ పొందవచ్చని బోర్డ్ అధికారులు సూచించారు. వీటితో పాటు డిజిలాకర్ లోనూ మార్క్ పొందవచ్చని పేర్కొన్నారు.
Also Read: Burkina Faso Attack: ఉగ్రవాదుల ఘాతుకం.. సైన్యం, ప్రజలపై దాడులు.. 100మంది మృత్యువాత!
24 వేల మందికి 95% పైగా మార్క్స్
కాగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 మధ్య నిర్వహించారు. దేశవ్యాప్తంగా 17.88 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు అంచనా. అయితే తాజా రిజల్ట్స్ లో 1.15 లక్షలకు పైగా విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించినట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. 24,000 మందికిపైగా విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించినట్లు వివరించింది.