Mulugu Farmer: ములుగు మల్టీ నేషనల్ మొక్కజొన్న క్రాస్ బ్రీడ్ విత్తనాలతో సేద్యం చేసిన ఓ రైతు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి తాను ఆత్మహత్య చేసుకుంటాను. ఆత్మహత్య చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ కు వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశాడు. ఇప్పుడు ఈ వినతి పత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వివరాల్లోకి వెళితే వెంకటాపురం మండలం వాడగూడెం గ్రామానికి చెందిన జాడీ ఈశ్వర్ తన ఆరు ఎకరాల్లో మల్టీ నేషనల్ మొక్కజొన్న క్రాస్ బ్రీడ్ (మేల్, ఫిమేల్) లతో సేద్యం చేశాడు.
అయితే సింజంట ఆర్గనైజర్ గొడవర్తి నరసింహమూర్తి తనకు మొక్కజొన్న విత్తనాలతో సేద్యం చేస్తే ఒక్కో ఎకరానికి నాలుగు టన్నుల దిగుబడి వస్తుందని నమ్మించి సేద్యం చేయించాడు. తీరా అన్ని రకాల పెట్టుబడులు పెట్టి దిగుబడి ఆశిస్తే ఒక్కో ఎకరానికి 14 కింటాలు మాత్రమే దిగుబడి వచ్చిందని ఆవేదన చెందాడు.
మాటమారుస్తున్న అధికారులు
ఇందుకు సంబంధించిన నష్టపరిహారంపై ఆర్గనైజర్లు, మండల వ్యవసాయ అధికారులు, జిల్లా అగ్రికల్చర్ అధికారి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ లకు పలుమార్లు వినతి పత్రాలు అందించామని ఈశ్వర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పలు సమావేశాల్లో ఆర్గనైజర్లు రైతులకు ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఎదుట ఒప్పుకున్న ఆర్గనైజర్లే మాట మార్చి అధికారులకు తెలవకుండా రైతులు తమకు అప్పులు ఉన్నారని సొంతంగా అప్పులని క్రియేట్ చేసి నష్టపరిచేందుకు తీవ్ర కుట్ర చేస్తున్నారని కలెక్టర్కు రాసిన వినతి పత్రంలో ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతి అయిన ఒక్కో క్వింట మొక్కజొన్నకు రూ. 3400 ఇస్తామని ఆశ పెట్టారని పేర్కొన్నారు. మొత్తంగా ఒక్కో ఎకరానికి 1,20,000 పెట్టుబడి పెట్టినప్పటికీ కనీసం 30 వేల రూపాయల ఆదాయం రాలేదని లేఖలో వివరించాడు.
Also Read: Omega Hospital: డ్రగ్స్‌తో పట్టుబడ్డ డాక్టర్.. సంచలన వివరాలు వెలుగులోకి!
ఆత్మహత్యకు పర్మిషన్ ఇవ్వండి
ఈ విధంగా నష్టపోయిన రైతులకు ఒక్కో ఎకరానికి కనీసం 90000 పరిహారం చెల్లిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపాడు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ సంబంధిత మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీల ఆర్గనైజర్లు, హెచ్‌ఓడి లతో మాట్లాడి రైతులు నష్టపోయినందుకు ఒక్కో ఎకరానికి 90 వేల రూపాయలు ఇచ్చేటట్టుగా అగ్రిమెంట్ రాయించుకున్నప్పటికీ అధికారులను పక్కదారి పట్టించి రైతులకు తీవ్ర నష్టం కలిగించే కుట్ర చేస్తున్నారని తెలిపాడు.
ఊరిలో అప్పుల బాధలు ఎక్కువయ్యాయి. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. దయ ఉంచి నష్టపరిహారం ఇప్పించండి లేదంటే నాకు ఆత్మహత్యకు పర్మిషన్ ఇవ్వండి అంటూ కలెక్టర్‌కు లేఖను అందించాడు. జాడి ఈశ్వర్ రావుతో పాటుజాడి రాంబాబు, నాగులపల్లి ప్రవీణ్, జిమిడి కొండల్ రావు, గోగు చిన్న సమ్మయ్య జిమిడి రాంబాబు వీరితోపాటు మరికొంతమంది ఆత్మహత్య లెటర్లు రాసి కలెక్టర్‌కు అందించారు.
Also Read: BRS Party: ఉప ఎన్నికలు వస్తే గులాబీ పరిస్థితి ఏంటి.. కరువైన బలమైన నాయకులు!