Maoists: మావోయిస్టు చేతిలో మరో వ్యక్తి హత్యకు గురయ్యాడని, ఈ ఘటన కొంచెం వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే మరుద్బాక పోలీస్ స్టేషన్ ఉసూర్ నివాసి నాగ భండారిని అనే వ్యక్తిని గుర్తు తెలియని మావోయిస్టులు హత్య చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మరణించిన నాగ భండారి లింగాపూర్ సమీపంలో హత్యకు గురైనట్లు అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. అతను నాగ భండారి సాంప్రదాయ పూజలో పాల్గొనడానికి తమ గ్రామమైన మరుద్బాకకు వెళ్లాడు.
ఈ క్రమంలోనే మావోయిస్టులు నాగ భండారిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. గత సంవత్సరం నాగ సోదరుడు తిరుపతి భండారిని కూడా ఉసూర్‌లో హత్య చేసిన విధంగానే నాగ భండారినీ గుర్తు తెలియని మావోయిస్టులు లింగాపూర్ సమీపంలో హత్యకు మావోయిస్టులు ప్రణాళిక రచించి అంతం చేసినట్లుగా సమాచారం. నాగ భండారి సోదరుడిని గత ఏడాది ఇన్ ఫార్మర్ నేతంతో మావోయిస్టు హత్య చేశారు. నాగ భండారినీ సైతం ఇన్ ఫార్మర్ గా పరిగణించే హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
Also Read: Indian Army: వణికిన పాకిస్థాన్.. ఇండియన్ ఆర్మీ ఫైనల్ వార్నింగ్
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌కు (Operation Kagar) తాత్కాలిక బ్రేక్ పడింది. ఆపరేషన్ కగార్‌పై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ పడింది. భారత్ – పాకిస్థాన్ యుద్దం నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులను ఏరివేసేందుకు కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న సీఆర్పీఎఫ్ బలగాలు వెనక్కి రావాలని కేంద్రం ఆదేశించింది.
దీంతో కర్రెగుట్టల్లో మావోయిస్టుల వేటకు విరామం పడింది. దాదాపు ఐదు వేల మందికి పైగా బలగాలను కేంద్రం వెనక్కి రిప్పిస్తోంది. కర్రెగుట్టల నుంచి బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సీఆర్‌పీఎఫ్ కోబ్రా జవాన్లను తమ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కేంద్ర బలగాలు హుటాహుటిన వెనుతిరుగుతున్నాయి.
Also Read: Viral Video: దరిద్రం అంటే మీదే బ్రో.. ఉత్తి పుణ్యానికి రూ.కోటి బిల్లు కట్టారు?