Indian Army: ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతోనే ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) చేపట్టినట్లు భారత సైన్యం స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, దాడుల భయంతో ఉగ్రశిబిరాలు ఖాళీ అవుతున్నాయని ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి త్రివిధ దళాల డీజీఎంవోలు మీడియా సమావేశం నిర్వహించి.. కీలక వివరాలు వెల్లడించారు. మరోసారి కాల్పులు జరిపితే పాక్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆర్మీ డీజీఎంవో రాజీవ్ ఘాయ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ‘ శనివారం మధ్యాహ్నం 3:15 గంటలకు పాక్ డీజీఎంవో నుంచి మాకు ఫోన్ వచ్చింది. కాల్పుల విమరణకు అంగీకరించాలని పాక్ ప్రాధేయ పడింది. అందుకే కాల్పుల విరమణకు అంగీకరించాం. కాల్పుల విరమణకు అంగీకరించిన.. గంటల్లోనే పాక్ కాల్పులకు విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. కాల్పులు జరిపింనందుకు పాక్‌కు వార్నింగ్ మెసేజ్ కూడా పంపాం. ఒకవేళ ఈ రోజు (ఆదివారం) రాత్రి కాల్పులు జరిపితే పాక్‌పై దాడి చేసేందుకు ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇంకోసారి పాక్ కాల్పులు జరిపితే అంతు చూస్తాం. పాక్ కాల్పుల్లో వీర మరణం పొందిన సైనికులకు నివాళులు అర్పిస్తున్నాం. ఆపరేషన్ సింధూర్‌లో ఇప్పటి వరకూ ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారు. భారత సైనికుల త్యాగం వృధా కాదు.. కానివ్వం. ఈ రోజు రాత్రి ఏం జరుగుతుందా? అని నిశితంగా మానిటర్ చేస్తున్నాం. ఇప్పటి వరకూ లక్ష్యాల సాధనలో భారత్‌వైపు ఎలాంటి నష్టం లేకుండా దాడులు చేశాం. భారత్‌వైపు వచ్చిన ప్రతి డ్రోన్‌ను నిర్వీర్యం చేశాం’ అని డీజీఎంవో స్థాయి అధికారులు తెలిపారు.
ముందే గుర్తించి.. ఆపరేషన్
ఉగ్రవాదాన్ని అంతం చేయడానికే ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించామని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. ‘ ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసింది. ఉగ్రవాద శిక్షణా సెంటర్లను ముందుగానే గుర్తించాం. దాడికి ముందే ట్రైనింగ్ సెంటర్లను ఖాళీ చేశారు. మురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను తొలిసారి నాశనం చేసేశాం. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి వాళ్లు ఇక్కడే శిక్షణ తీసుకున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేశాం. 100 మంది ఉగ్రవాదులను ఎయిర్ స్ట్రైక్‌లో హతం చేశాం. ఎయిర్ స్ట్రైక్ తర్వాత పీవోకే వద్ద పాక్ కాల్పులకు తెగబడింది. ఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలను విడుదల చేస్తున్నాం. పాకిస్థాన్ మాత్రం ప్రార్ధనా స్థలాలు, స్కూళ్లను టార్గెట్ చేసింది. ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలు మాత్రమే ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసింది. లాహోర్ నుంచి డ్రోన్, యూఏవీలతో భారత్ ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను పాక్ టార్గెట్ చేసింది. గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాలను మన ఆర్మీ ధ్వంసం చేసింది. లాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాం. మే-8,9వ తేదీవరకు శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్‌లతో దాడులు చేసింది. ఈ నెల 7-10వ తేదీల మధ్యలో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మృతి చెందారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 5, పాక్‌లోని 4 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశాం. పాకిస్థాన్ దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో క్లియర్ కట్‌గా చూపించాం’ అని త్రివిధ దళాల అధికారులు పేర్కొన్నారు.
Read Also- Operation Sindoor: పాక్‌కు చావు దెబ్బ.. అరగంటలో 5 వైమానిక స్థావరాలు ఔట్.. శభాష్ ఐఏఎఫ్!
#WATCH | Delhi: DGMO Lieutenant General Rajiv Ghai says "…In those strikes across 9 terror hubs left more than 100 terrorists killed…" pic.twitter.com/lPjM4BQSgc
— ANI (@ANI) May 11, 2025