Hyderabad Metro: పట్టణీకరణ వేగంగా జరుగుతున్న హైదరాబాద్ మహానగరవాసులకు ఆధునిక రవాణా వ్యవస్థగా సేవలందిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలుకు మరో అరుదైన గౌరవం దక్కినట్లు హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన హార్వర్డ్ యూనివర్శిటీ మెట్రోరైలుపై అధ్యయన పత్రం ప్రచురించినట్లు, అందులో హైదరాబాద్ మెట్రోరైలు సాధించిన విజయాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు వెల్లడించింది. అంతేగాక, గతంలో ఐఎస్ బీ, కొద్ది రోజుల క్రితం స్టాన్ ఫర్డు సంస్థలు ప్రాజెక్టును అభినందించగా, ఇపుడు హార్వర్డ్ యూనివర్శిటీ మెట్రో రైలుపై అధ్యయన ప్రతం ప్రచురించటంతో ప్రాజెక్టుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించినట్టయింది.
అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలు సైతం హైదరాబాద్ మెట్రో రైల్ విజయాలను తమ విద్యార్థుల అధ్యయనానికి పరిశోధనా పత్రాలుగా ప్రచురించినట్లు హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎన్వీఎస్ రెడ్డి ప్రకటనలో వెల్లడించారు. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) ప్రాతిపదికన మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మెట్రో రైలు అంటూ హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధన పత్రంలో స్పష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు.
Also Read: India Big Warning: పాక్‌కు భారత్ బిగ్ వార్నింగ్.. ఇక ఏం జరిగినా యుద్ధమే..
ప్రజా రవాణా వ్యవస్థలో ఒక నూతన ఒరవడిని సృష్టించిందని కూడా విశ్వవిద్యాలయం పేర్కొనటం మెట్రోరైలు ప్రాజెక్టు గొప్ప తనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ఈ ప్రాజెక్టు కాగితాలపై ప్రతిపాదనలుగా ఉన్న స్థాయి నుంచి ఫీల్డు లెవెల్ లో స్థల సేకరణ, సరి కొత్త ఇంజనీరింగ్ నైపుణ్యత కు సంబంధించి అనేక సవాళ్ళను అధిగమిస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న తీరును కూడా ప్రచురణ పత్రంలో పేర్కొన్నట్లు ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
రవాణా సమస్యలను పరిష్కరించేందుకే మెట్రో ప్రాజెక్టు
హైదరాబాద్ లో ఉన్న ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ (ఐ ఎస్ బీ) ప్రొఫెసర్లు, పరిశోధకులు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు స్థాపనకు అంకురించిన ఆలోచనలు, దానిని అమలు చేసిన తీరు ను హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒక కేస్ స్టడీగా ఎన్నుకుని, తన ప్రతిష్టాత్మకమైన బిజినెస్ జర్నల్ లో ప్రచురించినట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. 2006లో ఎన్వీఎస్ రెడ్డి నగర రవాణా సమస్యలను పరిష్కరించేందుకు మెట్రో ప్రాజెక్టు ఆలోచన చేశారని, ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల రూపకల్పన మొదలుకుని మేటాస్ కన్సార్టియం పతనం, రీ టెండర్ల ప్రక్రియ, భూసేకరణ సమస్యలు, అనేక రకాల ఆందోళనలు, రాజకీయ ఒడిదుడుకులు వంటి అనేక అడ్డంకులను అధిగమించి, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో కూడిన మెగా ప్రాజెక్టుగా అవతరించిందని పేర్కొన్నట్లు తెలిపారు.
హైదరాబాద్ కి మెట్రో రైల్ ఆవశ్యకతను, ఆ అవసరాన్ని ఆచారణాత్మకంగా ఆయన ఏ విధంగా అమలు చేశారో విశ్వవిద్యాలయం తన ప్రచురణ ప్రత్రంలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజా రవాణా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకువచ్చారని పేర్కొన్న విశ్వవిద్యాలయం భూసేకరణ సమస్యలు, వివిధ ప్రభుత్వ శాఖల ఆమోదాలు, రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక సవాళ్లు వంటి అనేక సమస్యలను సమర్థ నాయకత్వం తోనే ఈ ప్రాజెక్టు అధిగమించిందని కూడా పేర్కొన్నట్లు వెల్లడించారు. సమర్థమైన ప్రణాళికలు, సున్నితమైన చర్చల ఫలితంగానే హైదరాబాద్ మెట్రోను ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా పేరు తెచ్చుకున్నట్లు విశ్వవిద్యాలయం గుర్తించినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Also Read: TG EAPCET Results: గుడ్ న్యూస్.. ఫలితాలు వచ్చేశాయ్.. మార్క్స్ ఇలా పొందండి!