Congress Ministers (imagecredit:twitter)
ఖమ్మం

Congress Ministers: ఖమ్మం జిల్లా డెవలప్ మెంట్‌కు ముగ్గురు మంత్రుల వర్క్.. ఎందుకని?

Congress Ministers: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మంత్రులు హాట్ టాఫిక్ గా మారారు. పార్టీ లీడర్ల తో పాటు ప్రభుత్వ ఆఫీసర్లూ అవాక్కయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ ముగ్గురు మంత్రులు ఏకమై వర్క్ చేయడం చర్చంశనీయమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వంలోని కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరు ముగ్గురు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ముగ్గురు మంత్రులకూ అత్యధిక ప్రాధాన్యత ఉన్నది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు అంటూ స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటీవల కాంప్లిమెంట్ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా డెవలప్ మెంట్ కు ముగ్గురు ఏకమై ముందుకు సాగుతున్నారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా శాఖలతో సంబంధం లేకుండా ముగ్గురు సమన్వయంగా రివ్యూలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. పెండింగ్ పనులు, కొత్త ప్రాజెక్టులు, డెవలప్ మెంట్ కు నిధులు ఇవ్వాలని ప్రభుత్వంలో పట్టుపడుతూనే, వేగంగా వర్క్స్ పూర్తయ్యేందుకు నిత్యం అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ ప్రధాన కార్యాలయాల్లోనే కాకుండా జిల్లాల్లోనూ కంబైన్డ్ సమీక్షలు నిర్వహించడం గమనార్హం. దీంతో అధికారులు కూడా షాక్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సాక్షాత్తు ఆర్ధిక శాఖ మంత్రి కూడా ఖమ్మం జిల్లా కు చెందిన వ్యక్తి కావడంతో వచ్చిన ప్రపోజల్స్ పై పాజిటివ్ గా రియాక్టై, సీఎంతో చర్చించి నిధులు, అదనను వర్క్స్ ను కేటాయిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ ముగ్గురు వర్కింగ్ స్టైల్ చూసి, మిగతా మంత్రులు కూడా కళ్లు తేలుస్తున్నారు. జిల్లా పబ్లిక్ మాత్రం గతంలో పోల్చితే అభివృద్ధి పనుల్లో వేగం పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: UP Minister Narendra Kashyap: ఓబీసీలు సంఖ్యలో ఎక్కువ.. హక్కుల్లో తగ్గతనమే ఎందుకు?

ముగ్గురికి ప్రత్యేక గుర్తింపు?

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమర్థతతో వ్యవహరించే నాయకుడిగా పేరు పొందగా, తన అపారమైన అనుభవాన్ని ప్రజల కష్టాలు తీర్చేందుకు పనిచేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండటంతో పాటు మంచి స్ట్రాటజిస్ట్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తారని పార్టీలో డిష్కషన్. ఈ ముగ్గురి ఆలోచనలు, ప్లానింగ్ లు క్రోడీకరించి జిల్లా అభివృద్ధిలో మార్క్ చూపిస్తున్నారు. వాస్తవానికి వీరు ముగ్గురి మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్నదనే ప్రచారం గతంలో జరిగింది. ఒకే జిల్లాకు చెందిన వాళ్లు కావడంతో ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ఇలాంటి వి కామన్ గా ఉంటాయనే చర్చ కూడా తెర మీదకు వచ్చింది.

కానీ గత కొన్ని రోజుల నుంచి వీరి వర్కింగ్ స్టైల్ చూసి ప్రతిపక్షాలు కూడా షాక్ కు గురవుతున్నారు. జిల్లా డెవలప్ మెంట్ కోసం ఏకమై ఉన్నతాధికారులతో వర్క్స్ చేపించుకుంటున్నారు. జిల్లాలో డెవలప్ మెంట్ కు నిధులు ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం భట్టి సుముఖత వ్యవహరిస్తుండగా, తన ఎక్స్ పీరియన్స్ ను ఉపయోగించి జిల్లా అభివృద్ధికి మంత్రి తుమ్మల సహకరిస్తున్నారు. ఇక నాయకులు, లీడర్లు మధ్య గ్యాప్ రాకుండా సమన్వయం చేస్తూ, కార్యకర్తలను కాపాడుకునేందుకు మంత్రి పొంగులేటి చొరవ తీసుకొంటున్నారనే చర్చ ఆ జిల్లా పార్టీలో ఉన్నది.

విద్య, వైద్యంతో పాటు ఇన్ ఫ్రా స్ట్రాక్చర్ కు పెద్దపీఠ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైద్యం, విద్యతో పాటు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మెజార్టీ సెగ్మెంట్లు రిజర్వ్డ్ కావడంతో ఆయా ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు, సౌలత్ లు కల్పించాలని మంత్రులు కృషి చేస్తున్నారు. దవాఖాన్లు, పాఠశాలలు, స్కూళ్లు , రోడ్లతో పాటు ప్రభుత్వ స్కీమ్స్‌ పంపిణీకి చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలో ఏ శాఖ రివ్యూ జరిగినా..ఈ ముగ్గురు మంత్రులూ ఉమ్మడిగా పాల్గొంటున్నారు. తాజాగా హైదరాబాద్ జల సౌధలో జరిగిన ఇరిగేషన్ శాఖ రివ్యూలో ఈ ముగ్గురు మంత్రులు పాల్గొని, సీతా రామ ప్రాజెక్టు పురోగతిపై ఆరా తీశారు.

పనులు స్పీడప్ చేయాలని సూచిస్తూనే, పలు సలహాలు, సూచనలు ఉన్నతాధికారులకు ఇచ్చారు. రైతులకు మేలు జరిగేందుకు గ్రౌండ్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను సంబంధిత అధికారుల ముందు ఉంచారు. ఖమ్మంలో మెడికల్ కాలేజీ ప్రారంభించాలని ముగ్గురు మంత్రులు పట్టు బట్టి మరీ హెల్త్ మినిస్టర్తో లాంచ్ చేయించారు. అంతేగాక ముగ్గురు మంత్రులు వరుసగా జిల్లాలో పర్యటనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో అత్యధికంగా రోడ్లు, తాగు నీరు, హాస్పిటల్స్, విద్యుత్ వంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉన్నాయి.

Also Read: Operation Sindoor: ప్రధాని మోదీ షాకింగ్ ప్రకటన.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

దీంతో పాటు ప్రజల్లో పార్టీపై మరింత విశ్వాసం పెరిగేలా సన్న బియ్యం, రైతులకు బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, వంటి ప్రభుత్వ స్కీమ్ లపై ప్రచారం చేస్తున్నారు. ఈ దఫా ప్రభుత్వానికి మరో మూడేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో డెవలప్ మెంట్ వర్క్స్ ను స్పీడప్ చేస్తున్నారు. పెండింగ్ క్లియర్ చేస్తూనే, కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇవన్నీపార్టీకి మైలేజ్ గా మారతాయని పార్టీ లీడర్లు చెప్తున్నారు.

 

 

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?