UP Minister Narendra Kashyap( image credit: swetcha reporter)
తెలంగాణ

UP Minister Narendra Kashyap: ఓబీసీలు సంఖ్యలో ఎక్కువ.. హక్కుల్లో తగ్గతనమే ఎందుకు?

UP Minister Narendra Kashyap: కులగణన చేపట్టేందుకు ఇంతకుమించి మంచి అవకాశం రాదని, భవిష్యత్ లో దక్కుతుందో లేదో కూడా తెలియదని, దీన్ని అందరూ స్వాగతించాలని ఉత్తరప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ సహాయం మంత్రి నరేంద్ర కశ్యప్ వ్యాఖ్యానించారు. లేదంటే ఓబీసీల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టిన వారిమవుతామని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో బ్యాక్ వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్ మెంట్(బీసీసీఈ) ఆధ్వర్యంలో ‘కుల గణన ద్వారా ఓబీసీల భవిష్యత్ నిర్మాణం, సామజిక న్యాయం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

కాగా ఈ సమావేశానికి అతిథిగా నరేంద్ర కశ్యప్ హాజరై మాట్లాడారు. ఏప్రిల్ 30 హిస్టారికల్ డే అని, కేంద్రం దేశంలో జనగణనతో పాటు.. కుల గణన కూడా చేస్తానని ప్రకటించిందని వివరించారు. 1931లో చివరిసారిగా కులగణన జరిగిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నారు. మళ్ళీ ఇప్పుడు మోడీ సర్కార్ చేస్తోందని తెలిపారు. కులగణన చేపడితే బడుగుబలహీన వర్గాల స్థితిగతులను ఇతరులతో సమానం చేసేందుకు తోడ్పడుతుందన్నారు.

 Also Read: Wildlife Protection Act: వన్యప్రాణి సంరక్షణ చట్ట ఉల్లంఘన.. జింక మాంసం స్వాధీనం!

బడుగు బలహీన వర్గాల జీవన స్థితిపై సైమన్ కమిషన్ పలు రాష్ట్రాల్లో పర్యటించిందని, నివేదికలు సేకరించిందని ఆయన చెప్పారు. కాగా ఓబీసీ కమ్యూనిటీలో నకిలీ ఠాకూర్, నకిలీ బ్రాహ్మణులు.. చేరినట్లుగా సైమన్ కమిషన్ చెప్పిందన్నారు.విద్య, పొలిటికల్, ఇతర రంగాల్లో కూడా ఓబీసీలు క్రియాశీలకంగా ఎడగాల్సిన అవసరం ఉందని, బీసీల్లో చైతన్యం లేకపోవడం వల్లే కులగణనపై ఇంత ఆలస్యమైందని ఆయన తెలిపారు.

తెలంగాణ ప్రజలు చాలా బుద్ధిమంతులని, తెలివైన వారని, అన్ని విషయాల్లో చైతన్యం కలిగిన వారని నరేంద్ర కశ్యప్ కొనియాడారు. 16 శాతం మంది ఉన్న ఎస్సీలు తమ హక్కుల కోసం పోరాడి సాధించారని, కానీ ఓబీసీలు సగం మంది జనాభా ఉన్నా సాధించుకోలేకపోయామని పేర్కొన్నారు. ప్రధానిగా మోడీ ఉండటం మంచిదైందని, ఆయన కులగణన చేస్తానని స్పష్టం చేశారన్నారు. లేకుంటే ఓబీసీల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారేదని పేర్కొన్నారు.

 Also Read: Mahabubabad SP: అనుమానితులపై దృష్టి.. రాత్రి వేళల్లో పోలీసుల సడన్ చెకింగ్స్!

ఈ ప్రక్రియ ఆగకూడదని, ఎవరూ దీనికి అడ్డుపడకూడదని కోరారు. పహల్ గావ్ లో 26 మంది హిందువులను మతం అడిగి మరీ చంపారని, మోడీ చెప్పినట్లుగానే.. పీఓకేతో పాటు పీవోకేయేతర ప్రాంతాల్రలో కూడా దాడులు చేశారన్నారు. బోర్డర్ లో పాక్ దుశ్చర్యలకు దిగిందని, వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నరేంద్ర కశ్యప్ వ్యాఖ్యానించారు.

కులగణనతోనే దేశాభివృద్ధి.. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

కేంద్రం జనగణనతో పాటు కులగణన చేపడతానని నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమని, ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో  బ్యాక్ వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్ మెంట్(బీసీసీఈ) ఆధ్వర్యంలో ‘కుల గణన ద్వారా ఓబీసీల భవిష్యత్ నిర్మాణం, సామజిక న్యాయం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా లక్ష్మణ్ హాజరై మాట్లాడారు. మోదీ ప్రధాని అయ్యాక ఓబీసీలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఆర్ కృష్ణయ్య బీసీల కోసం జీవితాంతం పోరాటం చేస్తున్నారని కొనియాడారు.

కులగణనతోనే దేశాభివృద్ధి సాధ్యమని తెలిపారు. కులగణన దశాబ్దాలుగా చర్చనీయాంశంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పాకిస్థాన్ వక్రబుద్ధితో దాడులు చేస్తోందని లక్ష్మణ్ ఫైరయ్యారు. భారతదేశ అభివృద్ధి ఎంజెండాతో ప్రధాని మోడీ పనిచేస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికులకు నివాళులర్పించి మౌనం పాటించారు.

 Also Read: Karregutta Mulugu Effects: ఆదివాసీల ఊచకోతలు.. మావోయిస్టుల హింస.. కర్రెగుట్టల వాస్తవ కథనం!

రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. దశాబ్దాలుగా కులగణన జరగాలని పోరాటం చేస్తుంటే గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని విమర్శలు చేశారు. ఇప్పుడు కేంద్రం చేపడుతుంటే కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని విమర్శలు చేశారు. బీసీ ప్రధాని అయిన మోడీ బీసీల గొంతుకను గౌరవించి కులగణన చేపడుతున్నారని, దీనికి అందరూ మద్దతు తెలుపాలని, ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కోరారు.

అనంతరం తూళ్ళ వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. కులగణనను సమర్థవంతంగా నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఐఏఎస్ పరికిపండ్ల నరహరి, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, నరగౌని గౌడ్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, సీఎల్ఎన్ గాంధీ, వివిధ రంగాల్లో నిష్ణాతులు, రాజ్యాంగ నిపుణులు, విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?