Deputy Mayor Srilatha Shobhan Reddy: తార్నాకలో గుర్తు తెలియని వ్యక్తులు సర్కారు భూమిని కబ్జా చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అడ్డుకున్నారు. తార్నాకలోని ఎర్రకుంట చెరువు స్థలంలోని (సర్వే నెంబర్లు 121, 122, 123, 125) మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో ఎవరో గుడిసెలు వేస్తున్నారన్న విషయాన్ని స్థానికులు డిప్యూటీ మేయర్ కు తెలపటంతో వెంటనే స్పందించిన ఆమె ఉస్మానియా వర్శిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక, ఈ సమాచారాన్ని ఆమె జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్డీఓల దృష్టికి కూడా తీసుకెళ్లారు.
ప్రభుత్వ స్థలం గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో సుమారు 250 పైగా గుడిసెలు నిర్మిస్తున్నట్లు డిప్యూటీ మేయర్ ఇచ్చిన సమాచారంతో రంగంలో దిగిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని, గుడిసెలను తొలగించారు.
Also Read: UP Minister Narendra Kashyap: ఓబీసీలు సంఖ్యలో ఎక్కువ.. హక్కుల్లో తగ్గతనమే ఎందుకు?
డిప్యూటీ మేయర్ దంపతులు శ్రీలత శోభన్ రెడ్డి లు స్పాట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలను అరికట్టడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారని, ప్రభుత్వ స్థలాలను కాపాడటమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు.
తార్నాక ఎర్రకుంట చెరువు స్థలం కబ్జా యత్నం ఘటనపై హైడ్రాతో విచారణ చేయిస్తామని డిప్యూటీ మేయర్ వెల్లడించారు. తార్నాక ఎర్రకుంట చెరువు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కు చెందిన స్థలమని, ఈ స్థలాన్ని స్థానికుల కోసం వాకింగ్, పార్క్ ఏర్పాటు చేయడానికి ఉపయోగించాలని యోచించగా, కొన్ని కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయిందని ఆమె వెల్లడించారు. కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత ఇదే స్థలంలో స్థానికుల కోసం వాకింగ్ ట్రాక్, పార్క్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు