Ponguleti On KCR (imagecredit:swetca)
ఖమ్మం

Ponguleti On KCR: కేసీఆర్ పై మంత్రి పొంగులేటి సంచలన కామెంట్స్!

Ponguleti On KCR: ప్రాజెక్టు నిర్మించి ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం ఆవిష్కరిస్తామని చెప్పిన అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఏం మిగలకుండా దోచుకున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ని ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం పరకాల గండిలో రూ. 2.24 కోట్లతో అశ్వారావుపేట మండలం అచ్యుతాపురంలో రూ. 3.10కోట్లతో, తిరుమలకుంటలో రూ. 3.15కోట్లతో, కావడిగుండ్లలో రూ. 2.24కోట్లతో, అశ్వారావుపేట పట్టణంలో రూ. 2.53కోట్లతో నూతనంగా చేపట్టబోయే 33/11 కెవి సబ్ స్టేషన్ ల శంకుస్థాపనకు, మరియు రూ. 24.46కోట్ల అంచనా వ్యయంతో 33కెవి ఫీచర్ల విద్యుత్ ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టే కార్యక్రమం అశ్వారావుపేట నియోజకవర్గంలోని పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పొంగిలేటి కామెంట్స్

అశ్వారావుపేట నియోజకవర్గం కొన్ని దశాబ్దాల కాలంగా వెనుకబడి ఉంది. అలాంటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ ధ్యేయంమని అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి చొరవతో కరెంట్ వెలుగులు నింపేందుకు ఈ రోజు విద్యుత్ సబ్ స్టేషన్‌ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకుంటున్నామని చెప్పారు. వైఎస్సార్ హయాంలోనే ప్రతీ తండాకు, ప్రతీ గ్రామానికి నాణ్యమైన కరెంట్ తో పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే అని ఆయన అన్నారు.

Also Read: Pak Fake News: దిక్కుతోచని స్థితిలో పాక్.. ఈ వీడియోలు చూశాక మీరేమంటారో?

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎనిమిదో అద్భుతం కాళేశ్వరం కడుతున్నాం అని చెప్పి రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఐనప్పటికీ వాటన్నిటిని తట్టుకుని, వారు చేసిన తప్పిదాలను సరిచేస్తూ ఎన్నికల్లో ఇచిన ప్రతీ హామీని నెరవేరుస్తూ వస్తున్నామని వెల్లడించారు.

గురుకులాల ఏర్పాటుకు శంకుస్థాపన

ఎవరికీ ఉపయోగపడని ధరణినీ పక్కన పెట్టి ప్రతీ ఒక్కరికీ ఉపయోగ పడేలా భూ భారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చాంమని మంత్రి గుర్తు చేశారు. విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తున్నాం నిరుద్యోగ యువతకు ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాం. రాజీవ్ యువ వికాస్ పేరుతో త్వరలోనే ప్రతీ నిరుద్యోగికి ఉపాధి కల్పించేందుకు లోన్లు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో కోళ్ల ఫారాల్లో, పాడుబడిన రైస్ మిల్లుల్లో ఉన్న గురుకులను పక్కన పెట్టీ ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయలతో గురుకులాల ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు

. హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు పెంచామని స్పష్టం చేశారు. మనసుంటే మార్గం ఉంటుంది పేదవాడి కళ్లలో చిరునవ్వు చూడాలని కాస్త ఇబ్బందులు ఎదురు అయినా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. కచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం రైతుని రాజును చేశాం రుణమాఫీని సక్రమంగా అమలు చేశాం, రైతు బంధు ఇచ్చాం. వర్షాకాలంలో సన్నాలకి బోనస్ ఇచ్చాం యాసంగిలో కూడా ఇస్తామని మంత్రి తెలిపారు.

చేసింది గోరంత చెప్పుకున్నది కొండంత

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.8 లక్షల 19 వేల కోట్లలకు మన ప్రభుత్వం ప్రతీ నెల రూ. 6500 కోట్లు అస్సలు, మిత్తి కడుతూ వస్తున్నామన్నారు. పేదవాడికి ఏది ముందు అవసరమో అది ఇస్తున్నామని, మొదటి విడతలో ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఐటిడిఎ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో కోటా కంటే ఎక్కువ ఇళ్లు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసింది గోరంత చెప్పుకున్నది కొండంత మనం కొండంత చేసి గోరంత చెప్పుకుంటున్నామన్నారు.

ఐ అండ్ పీఆర్ ద్వారా రూ. 1052 కోట్లలను అసత్యపు ప్రచారానికి గత బీఆర్ఎస్ పాలకులు అక్రమంగా వినియోగించుకుందని ఆరోపించారు. పదిహేను, పదహారు నెలల నుంచి ఏ విధమైన పాలనను మన ప్రభుత్వం అందిస్తుందో రాబోయే మూడున్నర సంవత్సరాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అదే విధమైన మంచి సుపరిపాలన అందిస్తారని మనవి చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.

Also Read: Maoists Letter: నక్సల్స్ సంచలన లేఖ.. 6 నెలలు సైలెంట్.. ఆపరేషన్ కగార్‌కు బ్రేక్ పడ్డట్లే?

 

 

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?