Pak Fake Videos
జాతీయం

Pak Fake News: దిక్కుతోచని స్థితిలో పాక్.. ఈ వీడియోలు చూశాక మీరేమంటారో?

Pak Fake News: భారత్ దెబ్బకు పాక్ విలవిల్లాడుతోంది. ఆపరేషన్ సింధూర్ మొదలుకుని ఇప్పటి వరకూ పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ కొడుతున్న దెబ్బకు తట్టుకోలేకపోతోంది. భారత్ దెబ్బకు ఏం చేయాలో పాక్‌కు దిక్కుతోచట్లేదు. ఓవైపు దాడి థాటికి.. మరోవైపు ‘మా ప్రధాని పిరికోడు.. మేం భారత్‌తో యుద్దం ఎలా చేయగలం?’ అని సొంత పార్టీ ఎంపీలే, సామాన్య ప్రజల నుంచి వస్తున్న తిట్ల దండకంతో తామూ యుద్ధం చేస్తున్నామని, దీటుగా ఎదుర్కొంటున్నామని చెప్పుకోవడానికి ఫేక్ న్యూస్ ప్రచారానికి తెరలేపింది. భారత్‌తో నేరుగా యుద్ధానికి దిగలేని పాపిస్థాన్.. తమ ప్రజలను కాస్త శాంతిపచేసి, భారత పౌరుల్లో ఆందోళన పెంచేందుకుగాను సోషల్ మీడియా వేదికగా మాత్రం నకిలీ వార్తల ప్రచారం యుద్ధాన్ని ప్రారంభించింది. నకిలీ, పాత వీడియోలు, చిన్నపిల్లలు ఆడే గేమ్స్ వీడియోలను ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల వేదికగా పోస్టు చేస్తూ దుష్ప్రచారం చేస్తోంది. ఈ వీడియోలు, ఫొటోలను నిశితంగా గమనించిన పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఇందులో నిజమెంత అని ఫ్యాక్ట్ చెక్ (నిజనిర్ధారణ) చేసి అవన్నీ ఫేక్ అని పాక్ తీరును ఎండగట్టింది. మొత్తం 16 ఆధారాలతో పాక్ చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం ఇచ్చింది.

Read Also- Attack On TDP Office: సీఐడీ విచారణకు సజ్జల.. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు!

ఇంతకీ ఆ వీడియోల్లో ఏముంది?

  • ‘ఎక్స్’ వేదికగా మహ్మద్ అలీ రెజా అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేసి.. ఇండియాలోని జమ్మూ ఎయిర్ బేస్‌లో చాలా చోట్ల ప్రభావం పడ్డట్టు తేలిందని రాసుకొచ్చాడు. నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఆ వీడియో 2021, కాబూల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించినదని తేల్చింది.
  • మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ ఇండియాపై బాంబుల వర్షం కురిపించిందంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి. తీరా చూస్తే పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఆ వీడియో.. గేమింగ్ వీడియో అని తేలడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే పాక్‌కు బుద్ధి రాలేదని, పదే పదే పైత్యం ప్రదర్శిస్తోందని స్పష్టం అర్థమవుతోంది.
  • ఇవన్నీ ఒక ఎత్తయితే ఇండియన్ ఆర్మీకి చెందిన సుకోయ్ SU-30MKI పాక్‌లో కుప్పకూలిపోయిందని, పైలట్‌ను ప్రాణాలతో పట్టుకున్నట్లు పాక్‌కు చెందిన ఓ వ్యక్తి పోస్టు పెట్టాడు. ఇది కూడా ఫేక్ అని తేల్చిన పీఐబీ.. ఈ ఘటన 2014లో మహారాష్ట్రలో కూలిపోయినట్లు స్పష్టం చేసింది.
  • ఈ వీడియోలను ఎంతవరకూ ఇండియన్స్ నమ్ముతారో లేదో అని ఈసారి ఏకంగా బార్డర్ నుంచి తిన్నగా గుజరాత్‌ వైపు వచ్చిన పాక్ పైత్యంగాళ్లు.. హజీరా పోర్టుపై దాడి జరిగిందని వీడియోను రిలీజ్ చేశారు. ఇది కూడా అట్టర్ ప్లాప్ వీడియోనే అని తేలింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఆ వీడియో 2021 నాటి ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ పేలుడుకు సంబంధించినదని స్పష్టం చేసింది.
  • జలంధర్‌లో డ్రోన్‌ దాడి అంటూ వస్తోన్న దృశ్యాలను ఫ్యాక్ట్ చేయగా.. ఓ అగ్ని ప్రమాదం జరిగినప్పటివని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చేసింది.

మ్యాటర్ వీక్.. ప్రచారం పీక్స్!
చూశారుగా.. ఈ పరిస్థితుల్లోనూ ఫేక్ వీడియోలు, ఫొటోలు వైరల్ చేస్తున్నదంటే పాక్ పైత్యం ఎలా ఉందో. అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా.. ‘మ్యాటర్‌ వీక్‌గా ఉన్నప్పుడే… ప్రచారం పీక్స్‌లో ఉంటుంది’ అని అచ్చుగుద్దినట్లుగా ఇదే ఫాలో అయిపోతోంది పాక్. లేనిది ఉన్నట్లు… జరగనిది ఏదో జరిగిపోయిందన్నట్లుగా పాకిస్థాన్ బిల్డప్ కొడుతోంది. వీడియోలన్నీ ఫేక్ అయినప్పటికీ పాక్ పౌరులు, అక్కడి ప్రభుత్వం జబ్బలు చరచుకుంటూ ఓ రేంజిలో కలరింగ్ ఇస్తూ నవ్వులపాలైంది. జరిగిందేదో జరిగిపోయింది.. ఇక మన్నించండి అని కనీసం పాక్ నోట మాట రాలేదు కానీ.. ఇలా ఫేక్ వీడియోలు సృష్టించడానికి పరుగులు తీస్తోంది. ఇవన్నీ ఒకెత్తయితే భారత్‌కు చెందిన 5 ఫైటర్ జెట్లను కూల్చేశామని పాక్ నవ్వులు పూయించింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా నేరుగా డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా రంగంలోకి దిగారు. ఇండియన్ డ్రోన్లు పాక్ నగరాలపై దాడి చేస్తున్నా ఎందుకు అడ్డుకోలేదు? అని పార్లమెంట్‌లో సభ్యుల నుంచి ప్రశ్నలు రాగా విచిత్రమైన సమాధానం ఇచ్చారు. మా లొకేషన్లు చూపించడానికి ఇష్టం లేకనే డ్రోన్లను కూల్చేయలేదు. దీన్ని వివరించాలంటే టెక్నికల్‌గా చాలా కష్టం అని డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు. దీంతో ఆయన మాటలు విన్న సభలోని సభ్యులు నవ్వుకున్నారు. మరోవైపు పాక్ దేశానికి చెందినవారే మీమ్స్‌తో ట్రోల్ చేస్తుండటం గమనార్హం.

Read Also- Nuclear Bomb: పాక్ నుంచి అణు ముప్పు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?

 

 

 

ఇలాంటి మరెన్ని వీడియోలను ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు..

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?