YS-Jagan-And-YS-Vijayamma
ఆంధ్రప్రదేశ్

YS Vijayamma: తల్లి విజయమ్మ నుంచి వైఎస్ జగన్‌కు ఊహించని షాక్?

YS Vijayamma: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) కన్నతల్లి వైఎస్ విజయమ్మ నుంచే ఊహించని రీతిలో భారీ షాక్ తగలనుందా? అతి త్వరలోనే ఇదంతా జరగనుందా? ఇదే జరిగితే పరిస్థితులన్నీ మారిపోతాయా? అంటే తాజా పరిణామాలను కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని అర్థం చేసుకోవచ్చు. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీకి చెందిన షేర్ల బదలాయింపు వివాదంపై వైఎస్ ఫ్యామిలీలో (YS Family) పెద్ద యుద్ధమే నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్, విజయమ్మల మధ్య నెలకొన్న ఈ వివాదంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ)లో విచారణ జరుగుతోంది. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రిజిస్టర్‌లో వాటాదారుల పేర్లను మార్చి, తమ వాటాలను పునరుద్ధరించాలని వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతి రెడ్డి (YS Bharathi Reddy).. క్లాసిక్‌ రియాల్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్సీఎల్టీ జ్యుడీషియల్‌ సభ్యుడు రాజీవ్‌ భరద్వాజ్, సాంకేతిక సభ్యుడు సంజయ్‌ పూరిల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఇరువర్గాల తరఫు న్యాయవాదులు ఎన్సీఎల్టీలో సుదీర్ఘ వాదనలు వినిపించారు.

Read Also- Gold Rate Today : భారీగా పెరిగి బిగ్ షాక్ ఇచ్చిన గోల్డ్.. ఒకేసారి అంత పెరిగిందేంటి?

YS-Vijayamma-And-YsSharmila

ఈ లాజిక్ గమనించారా?
ఈ సందర్భంగా విజయమ్మ తరఫు న్యాయవాది వివేక్‌ రెడ్డి బయటికి తీసిన లాజిక్‌తో అందరూ నివ్వెరపోతున్నారు. ఈ షేర్ల వివాదంలో వైఎస్ జగన్ పదే పదే చెబుతూ వస్తున్న చెల్లిపై ప్రేమ, అనురాగం తగ్గిందనే విషయాన్ని ఎన్సీఎల్టీలో ప్రస్తావించారు. చెల్లి గురించి మాత్రమే మాట్లాడిన జగన్.. తల్లిపై ప్రేమ, అనురాగం తగ్గిందని చెప్పలేదు కదా? అంటూ లాజిక్‌తో కొట్టారు లాయర్. గిఫ్ట్‌ ఇచ్చాక ఏకపక్షంగా అవగాహన ఒప్పందం (ఎంఓయూ) రద్దు కుదరదనే విషయాన్ని కోర్టుకు విన్నవించారు. అంతేకాదు ఒకవేళ ఇలా జరగాల్సి వస్తే ఇరుపక్షాలు అంగీకరించాల్సి ఉందని విజయమ్మ తరఫు న్యాయవాది నివేదించారు. ఎన్సీఎల్టీలో సెక్షన్‌ 59 కింద పిటిషన్‌ వేసి వివాదం చేయడంలో జగన్‌ది కుటిల పన్నాగమని పేర్కొనడం గమనార్హం. మరోవైపు సరస్వతి సంస్థ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వాటాలను తల్లి విజయమ్మకు ఇచ్చాక వాటి గురించి అడిగేందుకు, ఒకసారి వాటాలను అప్పగించేశాక కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు వైఎస్‌ జగన్‌‌కు ఎలాంటి హక్కులూ ఉండవని ట్రైబ్యునల్‌కు నివేదించారు. వాటాల బదలాయింపు ప్రక్రియ కంపెనీ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుందని, బాండ్‌ను నోటరైజ్‌ చేసి అందించిన తర్వాతే బదలాయింపు జరిగిందని స్పష్టం చేశారు.

Read Also-Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు.. యువకుల ఫిర్యాదు

NCLT

జోక్యం చేసుకోలేం!
ఇలా ఇరువాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌ కుటుంబ వివాదంతో సంబంధం లేకుండా, కంపెనీ చట్టప్రకారం విధులు నిర్వహించాలి కదా? అని ప్రశ్నించింది. వారి కుటుంబ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని, 2021 జూన్‌ 14న వాటాల బదలాయింపునకు విజయమ్మ లేఖ ఇచ్చారన్న విషయాన్ని కోర్టుకు న్యాయవాది నిశితంగా వివరించారు. ఈ క్రమంలోనే జగన్‌ చెల్లిపై ప్రేమ లేదంటున్నా.. తల్లిపై ఇప్పటికీ ప్రేమ, వాత్స్యలం ఉందనే చెబుతున్నారనే విషయాన్ని వివేక్‌ రెడ్డి గుర్తు చేశారు. ఇదే ఇక్కడ లాజిక్ పాయింట్ అయ్యింది. జగన్, భారతిరెడ్డి బోర్డు డైరెక్టర్లుగా రాజీనామా చేసి వెళ్లిపోయిన తర్వాత కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని, గిఫ్ట్‌డీడ్‌ చెల్లదని జగన్‌ అంటున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే దీని చట్టబద్ధతను సివిల్‌ కోర్టులో తేల్చుకోవాలని లాయర్ వెల్లడించారు. అంతేకాదు.. ఒకసారి ప్రతిఫలం తీసుకుని వాటాలను బదలాయించిన తర్వాత, గిఫ్ట్‌డీడ్‌ కూడా అమలయ్యాక ఇక్కడ పిటిషన్‌ వేయడానికి వీల్లేదని.. తగిన కారణం లేకుండా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని ఎన్సీఎల్టీని విజయమ్మ తరఫు లాయర్ కోరారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు పూర్తయినట్లుగా ప్రకటించిన కోర్టు, తదుపరి విచారణను మే-30కి వాయిదా వేసింది.

Read Also- YS Jagan: వైఎస్ జగన్ షాకింగ్ ప్రకటన.. ఆశ్చర్యపోయిన నేతలు!

తీర్పు ఎలా ఉంటుందో?
దీన్ని బట్టి చూస్తే ఈ విచారణ మొత్తమ్మీద వైఎస్ జగన్ వాదనల కంటే విజయమ్మ వాదనలే బలంగా వినిపించినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. జగన్ మాట్లాడే ప్రేమ, అనురాగం, వాత్సల్యం అనే మాటలు ఇక్కడే రివర్స్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వాదనలు పూర్తయినట్లేనని కోర్టు చెప్పడంతో ఇక మిగిలినది తీర్పేనన్న మాట. అది కూడా మే 30న రాబోతోందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు విజయమ్మ తరఫున లాయర్ లాజికల్ పాయింట్లు లేవనెత్తడంతో వైఎస్ జగన్‌కు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయనే అటు మీడియాలో, ఇటు నెట్టింట్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఒకవేళ తీర్పు ఇలా వస్తే మాత్రం విజయమ్మ నుంచే జగన్‌కు ఊహించని షాక్ రాబోతోందని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరి తీర్పు ఎలా ఉంటుందో? ఎవరికి అనుకూలంగా ఉంటుందో అనే దానిపై వైసీపీలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు.

Read Also-Colonel Sophia Qureshi: ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా.. ఈ ఇద్దరి ట్రాక్ రికార్డ్ చూస్తే…?

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?