Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.
అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.
ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం, రూ. 99,600 గా ఉంది. ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.
అయితే, గత రెండు రోజుల నుంచి పెరిగిన గోల్డ్ ధరలు ( Gold Rates ) ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పెరగడంతో కొనుగోలుదారులు గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. 22 క్యారెట్స్ బంగారం ధర పై రూ. 550 కు పెరిగి రూ. 91,750 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.600 కు పెరిగి రూ.99,600 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,08,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 91,750
విజయవాడ ( Vijayawada) – రూ. 91,750
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.91,750
వరంగల్ ( warangal ) – రూ.91,750
24 క్యారెట్లు బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.99,600
విజయవాడ – రూ.99,600
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.99,600
వరంగల్ ( warangal ) – రూ.99,600
వెండి ధరలు
గత కొద్దీ రోజుల నుంచి బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.5,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ. 1,11,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
హైదరాబాద్ – రూ. 1,11,100
విజయవాడ – రూ. 1,11,100
విశాఖపట్టణం – రూ. 1,11,100
వరంగల్ – రూ. 1,11,
Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.