AE Gyaneshwar: మేడ్చల్ జిల్లా ప్రగతినగర్ విద్యుత్ ఏఈ జ్ఞానేశ్వర్ లంచం డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మిథిలా నగర్ లోని ఓ బిల్డింగ్ ముందు ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కేవి లైన్ మార్చడంలో భాగంగా పోల్ షిఫ్టింగ్ కోసం ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు డిమాండ్ చేశారు.
రూ.30 వేలకు బేరం కుదిరి రూ.10 వేలు అడ్వాన్స్ తీసుకుంటుండగా పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈ ఆఫీస్, ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
Also Read: Ponnam Prabhakar: హైదరాబాద్ భద్రతపై.. మంత్రి పొన్నం ప్రభాకర్.. కీలక ప్రకటన!
ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వండి
ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లయితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు తెలిపారు. అదేవిదంగా ఏసీబీ తెలంగాణ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వాట్స్ ఆప్ (9440446106), ఫేస్ బుక్ (తెలంగాణ ఏసీబీ), ట్విట్టర్ (@TelanganaACB) ద్వారా కూడా సంప్రదించవచ్చన్నారు. ఫిర్యాదులు చేసిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు