Tillu Squre Ott Release Date Locked To Stream On Netflix
Cinema

Tillu Square: డేట్ ఫిక్స్, ఓటీటీలోకి టిల్లు స్క్వేర్‌ ఎంట్రీ అప్పుడే..!

Tillu Squre Ott Release Date Locked To Stream On Netflix: ఇటీవల థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న టాలీవుడ్‌ మూవీ టిల్లు స్క్వేర్. గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లుకు సీక్వెల్‏గా వచ్చిన ఈ మూవీలో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, నటి అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా యాక్ట్‌ చేశారు.ఈ మూవీని డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించారు. ట్రైలర్, సాంగ్స్, టీజర్‏‏తోనే క్యూరియాసిటిని పెంచేశారు మూవీ మేకర్స్. భారీ అంచనాల మధ్య టిల్లు స్క్వేర్‌ను రిలీజ్ చేయగా ఆడియెన్స్‌ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ మూవీ మార్చి 29 2024న రిలీజై దాదాపు రూ. 100 కోట్లకు పైగా థియేటర్లలో రికార్డు వసూళ్లను రాబట్టి 2024 టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇక డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీస్‌తో హీరో సిద్ధూ మరింత క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. తనదైన డైలాగ్ డెలివరీ, మ్యానరిజంతో మరోసారి థియేటర్లలో జనాలను అలరించాడు. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ కాబట్టి ఈ మూవీని చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియెన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ లవర్స్ నిరీక్షణకు తెర దించారు మేకర్స్. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ని ఆడియెన్స్‌కి అందించారు.

Also Read:లారెన్స్‌ చేసిన పనికి అందరూ షాక్‌

ఈ మూవీని ఏప్రిల్ 26న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. తెలుగుతో పాటుగా, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ మూవీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. చరిత్ర పునరావృతం కావడం సాధారణం, అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవుతాయి. అట్లుంటది టిల్లుతోని.. టిల్లు స్క్వేర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 26న వస్తుంది’ అంటూ రాసుకొచ్చింది. ఇక ఎట్టకేలకు టిల్లు స్క్వేర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రావడంతో మూవీ లవర్స్ ఖుషీ ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్‌.

టిల్లు స్క్వేర్‌ను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఫస్ట్ పార్టులో నేహా శెట్టి కథానాయికగా నటించగా, సెకండ్ పార్టులో అనుపమ పరమేశ్వరన్ సందడి చేసింది. ఇక టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు మూడో భాగం టిల్లు క్యూబ్ తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ఇదివరకే అనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ త్వరలోనే రానుంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!