Man Hulchul Hyderabad (imagecredit:twitter)
హైదరాబాద్

Man Hulchul Hyderabad: పోలీస్ బాస్ ఫోన్ నెంబర్ తో వ్యక్తి హల్చల్.. కేసు నమోదు!

తెలంగాణ: Man Hulchul Hyderabad: ట్రాఫిక్​ జాం అయ్యింది పక్క రోడ్డు నుంచి వెళ్లమని చెప్పిన పాపానికి ఓ వ్యక్తి విధుల్లో ఉన్న హోంగార్డు పై చిందులేశాడు. నేనెవరో తెలుసా? తలుచుకుంటే రెండు నిమిషాల్లో నిన్ను బొక్కలో వేయిస్తానంటూ హైదరాబాద్​ కమిషనర్ సీ.వీ. ఆనంద్​ ఫోన్​ నెంబర్​ ను తన మొబైల్​ లో చూపిస్తూ బెదిరించాడు. నార్సింగి పోలీస్​ స్టేషన్​ లో హోంగార్డుగా పని చేస్తున్న షేక్ రహంతుల్లా బండ్లగూడ చౌరస్తా వద్ద డ్యూటీలో ఉన్నాడు.

ఆ సమయంలో ట్రాఫిక్​ జాం అయ్యింది. ఈ క్రమంలో వాహనాలను మరో రోడ్డు వైపు మళ్లిస్తున్నాడు. అయితే, ద్విచక్ర వాహనంపై తన కుమారునితో కలిసి వచ్చిన ఓ వ్యక్తి పక్క రోడ్డు నుంచి వెళ్లమని చెప్పినందుకు హోంగార్డుతో గొడవ పెట్టుకున్నాడు. నన్నే ఆపుతావా? అంటూ అంతెత్తున లేచాడు.

Also Read: Simhachalam Tragedy: సింహాచలం ఘటన పై ప్రభుత్వం సీరియస్..!

తన సెల్​ తీసి అందులో హైదరాబాద్​ కమిషనర్​ ఆనంద్​ ఫోన్​ నెంబర్​ చూపిస్తూ తలుచుకుంటే నిన్ను లోపల వేయిస్తానంటూ బెదిరించాడు. అతని కుమారుడు కూడా హోంగార్డును ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు హోంగార్డు షేక్ రహంతుల్లా ఫిర్యాదు చేయగా నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు