విశాఖపట్నం: Simhachalam Tragedy: సింహాచలం ఘటన పై ప్రభుత్వం సీరియస్ గా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నారు. ప్రమాద ఘటనపై హోమంత్రి అనిత అధికారులతో కలిసి సహయక చర్యలను పర్యవేక్షించారు.
సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో జరిగిన ప్కమాదంలో ఎడుగురు మృతిచెందగా అందులో నలుగురు పురుషులు ముగ్గరు మహిళలు ఉన్నారని తెలిపారు. ఈ గటనపై పూర్తి విచారణ జరుపుతామని అన్నారు. ప్రమాదానికి గురైన వారికి వెంటనే నష్టపరిహారం అందిస్తాం మనొ దీనిపై ఎవరు రాజకీయం చేయొద్దు అని హోమంత్రి అన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
లనతే ిాలదఫ YS Sharmila: షర్మిల ఇంటి వద్ద హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు..
ప్రమాదం జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారని అన్నారు. గటన పై విచారణ పూర్తి చేసి నివేదిక వచ్చేసరికి
రెండు రోజులు సమయం పడుతుందని, వచ్చిన తరవాత దానిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అలాగే చనిపోయిన బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
దాంతో పాటుగా ప్రమాదంలో గాయపడిన వారికి రూ 3.లక్షల చొప్పున పరిహారం అందించాలని, మరియు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అవకాశం కల్పించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆలయంలో ఎవరైనా తప్పు చేసినా, అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని చనిపోయిన వారు ఏ పార్టీ అయినా నష్టపరిహారం అందిస్తామని చావులకు పార్టీలు ముడిపెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Also Read: AP Govt Schools: ఏపీలో వెరైటీ ప్రచారం.. మైక్ తో దంచేస్తున్నాడు.. మ్యాటర్ ఏంటంటే?