YS Sharmila: షర్మిల ఇంటి వద్ద హై టెన్షన్.. అసలేం జరుగుతోంది?
YS Sharmila (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

YS Sharmila: షర్మిల ఇంటి వద్ద హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు..

YS Sharmila: కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షరాలు వైఎస్. షర్మిల.. రాజధాని అమరావతిలో పర్యటనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 2015లో ప్రధాని మోదీ (PM Modi) రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతమైన ఉద్దండరాయుని పాలెంలో ఆమె పర్యటించాలని నిర్ణయించారు. దీంతో గన్నవరం మండలం కేసరపల్లిలోని ఎస్.ఎల్.వి గార్డెన్స్ లోని షర్మిల నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆమెను పర్యటనకు అనుమతించకుండా హౌస్ అరెస్ట్ చేశారు.

భారీగా బలగాలు మోహరింపు
ప్రస్తుతం షర్మిల ఇంటి వద్ద పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు భారీగా మోహరించాయి. ఆమెను ఇంట్లో నుంచి బయటకు రాకుండా బారికేడ్లను సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసుల తీరును షర్మిల తీవ్రంగా తప్పుబడుతున్నారు. తన పర్యటనను ఆంక్షలతో అడ్డుకోలేరని ఆమె తేల్చి చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఉద్దండరాయుని పాలెం వెళ్లి తీరుతానని షర్మిల స్పష్టం చేశారు. దీంతో షర్మిల ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

Also Read: Gold Rate Today : అక్షయ తృతీయ ఎఫెక్ట్.. తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు మిస్ అయ్యారో?

షర్మిల సూటి ప్రశ్న
మరోవైపు సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబును వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని నిలదీశారు. అందుకు కారణమేంటో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని సూచించారు. ‘నా పీసీసీ కార్యాలయానికి వెళ్లడం కూడా నేరమేనా? రాజ్యంగం కల్పించిన హక్కులను ఎందుకు కాల రాస్తున్నారు? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

ప్రధాని రాక నేపథ్యంలో..
ఇదిలా ఉంటే ప్రధాని మోదీ మే 2వ తేదీని రాజధాని అమరావతి రానున్నారు. జగన్ హయాంలో అటకెక్కిన రాజధాని పనులను ప్రధాని తిరిగి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభను సైతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రధాని రాకకు సంబంధించిన ఏర్పాట్లతో రాజధాని అమరావతి ప్రాంతం హడావిడీగా ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల రాజధాని పర్యటనకు పిలుపునివ్వడంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.

Also Read This: Star Heroine: నన్ను ఒంటర్ని చేశారు.. నాతో ఎవరూ లేరు.. చాలా బాధ పడ్డా..

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!