HC on Azharuddin: ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ పేరును తొలగించవద్దని తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను ఆదేశించింది. నార్త్ స్టాండ్‌కి ఉన్న తన పేరును తొలగించాలని హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య నిర్ణయించడంతో అజహరుద్దీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
Also read: SSC 10th Results: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్స్ వచ్చేశాయ్.. మార్క్స్ ఇలా పొందండి!
అజహరుద్దీన్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాల పాటుగా క్రికెటర్‌గా భారత జట్టుకు సేవలందించానని, అంబుడ్స్‌మన్ ఆదేశాలపై స్టే ఇవ్వాలని ఆయన హైకోర్టుకు విజ్ఞప్తి చేసారు. అజహరుద్దీన్ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు, తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్‌సీఏను ఆదేశించింది.