Hero Raghava Lawrence Distributed Bikes To The Disabled
Cinema

Raghava Lawrence: లారెన్స్‌ చేసిన పనికి అందరూ షాక్‌

Hero Raghava Lawrence Distributed Bikes To The Disabled: ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడు అండగా నిలుస్తూ సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్. సేవా కార్యక్రమాల్లో ముందుంటూ తన వంతుగా సేవలను అందిస్తారు. అంతేకాదు తన సంపాదనలో ఎక్కువ శాతం సేవా కార్యక్రమాలకే కెటాయిస్తారు. ఇక తన తల్లి పేరుమీద ఫౌండేషన్స్ స్టార్ట్ చేసి దాని ద్వారా పెద్దవాళ్లకి సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు లారెన్స్.

తాజాగా ఆయన వికలాంగులకు బైక్స్ పంపిణీ చేశారు. నిజానికి ప్రస్తుతం ఆ వికలాంగులు ఉంటున్న ఇల్లు కూడా లారెన్స్‌ కంటించినవే. ఉండటానికి సరైన ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న ఆ వికలాంగులకు ఇల్లు కట్టిస్తాను అని గతంలో మాట ఇచ్చారట లారెన్స్‌. అన్నట్లుగానే వారికి ఇటీవలే కొత్త ఇంటిని కట్టించారు. ఇప్పుడు వారికి బైక్స్ కూడా అందించారు. ఆ బైక్స్ చూసిన ఆనందంలో వికలాంగులు భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దాంతో అది కాస్త వైరల్ అవుతోంది.

Also Read: కల్కి 2898 ఏడీ సాలిడ్ రికార్డ్స్‌..!

ఆ వీడియోని చూసిన నెటిజన్స్ లారెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నువ్వు చాలా గ్రేట్ అన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక లారెన్స్‌ మూవీస్ మ్యాటర్‌కొస్తే ఇటీవలే జిగర్ తాండ డబుల్ డెక్కర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం వరుస మూవీస్ చేస్తూ పుల్ బిజీగా ఉన్నారు. వాటిలో బులెట్, బెంజ్ వంటి పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. ఈ మూవీస్ వచ్చే ఏడాదికి ఆడియెన్స్‌ ముందుకు రానున్నాయి.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు