Police On Pakistanis: జమ్మూ కశ్మీర్ లోని పహాల్గమ్ లో జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మొత్తం 27 మంది మృతి చెందారు. ఉగ్రవాదుల కోసం ఓ వైపు పోలీసులు వెతుకులాట మొదలు పెట్టింది. ఈ దాడి ఎలా జరిగింది? ఎవరు చేశారు? దాని పై నిఘా పెట్టారు. అయితే, తాజాగా హైదరాబాద్ లో ఉంటున్న పాకిస్థానీలకు నోటీసులు పంపించారు.
హైదరాబాద్ లో నివసిస్తున్న నలుగురు పాకిస్థానీలకు పోలీసు నోటీసులు పంపించారు. ఈ నలుగురిని షార్ట్ టర్మ్ వీసా (STV) హోల్డర్స్ గా ఉన్నట్టు గుర్తించారు. రేపటి లోగా హైదరాబాద్ విడిచి వాళ్ళ దేశానికి వెళ్లాలని నోటీస్ లో పోలీసులు పేర్కొన్నారు.
Also Read: Fire Accident: ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు.. భయంతో జనాలు పరుగులు.. వీడియో వైరల్
హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ లో కలిపి 213 మంది పాకిస్తానీ లు ఉన్నారు. వీరిలో 4 గురు షార్ట్ టర్మ్ వీసా మినహాయిస్తే మిగతా అందరికీ లాంగ్ టర్మ్ వీసాలు (LTV) ఉన్నట్టు గుర్తింపు లాంగ్ టర్మ్ వీసా లు కలిగిన పాకిస్తానీలకు కేంద్రం మినహాయించింది. దీంతో. షార్ట్ టర్మ్ వీసా కలిగిన నలుగురు పాకిస్తానీలకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు పంపించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు