Fire Accident: ఆయిల్ ట్యాంకర్ బండ్లు రోడ్డు మీద వేగంగా దూసుకెళ్తాయి. ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకే ఈ బండ్లతో జాగ్రత్తగా ఉండాలి. వాటిని నడపడమే కష్టం అనుకుంటే.. మెయింటైన్ చేయడం చాలా కష్టం. తాజాగా జరిగిన సంఘటన తెలిస్తే షాక్ అవుతారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆయిల్ ట్యాంకర్ లారీ నుంచి ఆకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. ఆయిల్ ట్యాంకర్(Oil tanker) పేలి వాహనం దగ్ధమైంది. భయంతో స్థానికులు పరుగులు తీశారు.
పెద్దంబర్ పేట్ ఓఆర్ఆర్ పైన గౌరేళ్లి ఎగ్జిట్ వద్ద ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు(Fire) వచ్చాయి. చిన్నగా స్టార్ట్ అయి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటంతో భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో లారీ దగ్ధమైంది. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. ఎండల వలన మంటలు వచ్చాయా లేక సాంకేతిక లోపమా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Also Read: Modi and Chandrababu: అమరావతి పునఃప్రారంభం.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం
వేసవి కాలంలోఎండలు ఎక్కువగా ఏరియాల్లో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సమ్మర్ లో మండే ఎండలకు తోడు ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే ఆస్తి, ప్రాణనష్టాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మొదటి నుంచి ఎండలు విపరీతంగా ఉన్నాయి. క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. కాబట్టి, ప్రజలు ప్రయాణించే టప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు